జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై (Bipin Rawat chopper crash case) ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ (IAF Chief VR Chaudhari) తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తమిళనాడులోని కూనురు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో పాటు మొత్తం 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై (Bipin Rawat chopper crash case) ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ (IAF Chief VR Chaudhari) తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మద్జులికా రావత్‌తో పాటు మరో 12 మంది సాయుధ దళాల సిబ్బంది మృతి పట్ల వైమానిక దళాధిపతి సంతాపం వ్యక్తం చేశారు. వారిని నివాళులర్పించారు. భారత వాయు సేన అత్యంత శక్తివంతమైనదని.. వాయుసేనలో పనిచేసే అదృష్టం దక్కడం గొప్ప విషయమని అన్నారు. వాయుసేన సంపన్నమైన వారసత్వాన్ని యువ అధికారులు ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచే తాను ఈ స్థాయికి వచ్చినట్టుగా చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు. ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకడుగు వేయద్దని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరం అని అన్నారు. ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా ఫెయిర్‌గా జరుగుతోందన్నారు. సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ దర్యాప్తుకు చెందిన అంశాలను వెల్లడించలేనన్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? లేక సాంకేతిక సమస్య తలెత్తిందా..? మాన తప్పిదమా..? అనేది విచారణలో తెలుస్తుందన్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి దారి తీసిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టబోమని చెప్పారు. ఘటన స్థలంలో దొరికిన ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకు కొన్ని వారాల సమయం పడుతుందన్నారు.
తూర్పు లడఖ్ ప్రాంతంలో స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని వివేక్‌రామ్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో పాక్, చైనాల నుంచి బెదిరింపులు వస్తూనే ఉంటాయని... వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రాన్స్‌తో 36 రాఫెల్‌ల ఒప్పందం కుదిరిందని.. అందులో 32 రాఫెల్‌లు వచ్చాయని, మిగిలిన నాలుగింటిలో 3 విమానాలు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పారు. చివరి విమానానికి సంబంధించి కొన్ని ట్రయల్స్ మిగిలి ఉన్నాయని తెలిపారు.