తమిళనాడులోని నాగపట్నం సముద్ర తీరంలో క్రూడాయిల్ లీక్ అయ్యింది. దీని వల్ల చేపలు, పీతలు, ఇతర చలచరాలు మరణించాయి. చనిపోయిన కొన్ని జీవులు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగపట్నంలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్)కు చెందిన కావేరీ బేసిన్ రిఫైనరీ పైపులైన్ పగిలిపోయింది. దీంతో వందల లీటర్ల క్రూడాయిల్ సముద్రంలోకి లీకైంది. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. ఈ లీకేజీ వల్ల సమీపంలోని తీర జలాలు, తీరం కలుషితం అయ్యాయి. అయితే దీనిని సీపీసీఎల్ అధికారులు చిన్న ఘటనా పేర్కొన్నారు. పైప్‌లైన్‌ను రిపేర్ చేయడానికి, ప్రభావిత ప్రాంతాన్ని పరిష్కరించడానికి జాయింట్ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. లీకేజీని లెక్కించేందుకు, పర్యావరణానికి ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
వాస్తవ పరిస్థితులకు దూరంగానే.. రాహుల్ గాంధీ కామెంట్స్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్..
ఈ ఘటనతో చేపలు, ఇతర జలచరాలు మృత్యువాతపడ్డాయి. దీంతో పత్తినాచెరి శివారులోని మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. చమురు లీకేజీని పరిశీలించేందుకు కోస్ట్ గార్డ్ కు చెందిన రెండు సముద్ర నౌకలు, ఒక డోర్నియర్ విమానాన్ని రంగంలోకి దించారు. సముద్రంలోకి 50 మీటర్ల వరకు కాలుష్యం కనిపించడంతో ఆ ప్రాంతంలోని మత్స్యకారులు శుక్రవారం సముద్రంలోకి వెళ్లలేదు.
నాగపట్నం జిల్లా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. గురువారం సాయంత్రం 6.50 గంటల సమయంలో సముద్రం నుండి కిరోసిన్ వాసన వస్తోందని నాగూర్ మత్స్యకారులు మొదట ఫిర్యాదు చేశారు. సీపీసీఎల్ అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించినప్పటికీ సముద్రంలో చమురు లీకేజీ మూలాలను కనుగొనలేకపోయారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నమే మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. పైప్ లైన్ లో మిగిలిపోయిన ముడిచమురు మాత్రమే లీక్ అయిందని, దాని పరిమాణాన్ని అంచనా వేయలేమని పేర్కొన్నారు.
హర్యానాలో బస్సును గుద్దిన ట్రక్కు... 7గురు మృతి, నలుగురికి గాయాలు
దీనిపై ఎన్విరాల్ మెంట్ సెక్రటరీ సుప్రియా సాహు మాట్లాడుతూ.. ఆయిల్ లీకేజీ ఆందోళనకరంగా లేదని, దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, వారు నేడు (శనివారం) ఘటనా స్థలాన్ని సందర్శించి, లీకేజీ పరిమాణాన్ని అంచనా వేస్తారని తెలిపారు. కాగా.. ఈ ఆయిల్ లీకేజీ పట్టినాంచెరి నుంచి శమంతన్పేట్ తీరం వరకు వ్యాపించిందని స్థానిక మత్స్యకారులు తెలినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. కాగా.. ఆయిల్ లీకేజీ వల్ల చేపలు, పీతలు చనిపోయి ఒడ్డున కొట్టుకురావడంతో సీపీసీఎల్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తొలుత మరమ్మతు పనులు చేపట్టడానికి వారు అంగీకరించలేదు. దీంతో సబ్ కలెక్టర్ శాంతి అక్కడికి చేరుకొని, శాంతి చర్చలు జరిపారు.
మేకప్ ఎంతపని చేసింది... వధువును చూసి కంగుతిన్న వరుడు... పెళ్ళి క్యాన్సిల్
కావేరీ బేసిన్ రిఫైనరీని 2019లో డీకమిషన్ చేశామని సీపీసీఎల్ అధికార ప్రతినిధి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు తెలిపారు. అయితే ఓఎన్జీసీకి చెందిన నరిమానం ఆయిల్ వెల్స్ నుంచి ముడిచమురును రిఫైనరీ ట్యాంకుల్లో నిల్వ చేసి ప్రతీ 45 రోజులకు ఒకసారి చెన్నైకి తరలించి మనాలి రిఫైనరీలో ప్రాసెసింగ్ చేస్తారు.
