హర్యానాలోని అంబాలాలోని యమునా నగర్-పంచకుల హైవేపై ట్రైలర్ ట్రక్కు బస్సు ఢీకొనడంతో ఏడుగురు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

అంబాలా : హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా నగర్-పంచకుల హైవేపై ట్రైలర్ ట్రక్కు ఓ బస్సును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. షాజాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

షాజాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మాట్లాడుతూ, లోడ్ తో ఉన్న ట్రైలర్ ట్రక్ బస్సును వెనుక నుండి ఢీకొట్టింది. మొదట ట్రక్కు బస్సు చక్రాల మీదికి వెళ్లి.. పూర్తి బస్సు మీదికి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని, ప్రమాదం చాలా ఘోరంగా ఉందని.. ఈ కారణంగా ట్రైలర్ ట్రక్ బస్సును గుద్ది పక్కకుతిరిగిపోయి రాంగ్ సైడ్‌లో బోల్తా పడిందని తెలిపారు. ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై తదుపరి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీతో బిల్ గేట్స్ సమావేశం.. వివిధ రంగాల్లో భారతదేశం పురోగతిపై ప్రశంసలు..

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసం స్నేహితుడిని హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో కలకలం రేపింది. నాసిక్ లో నివసించే అర్జున్ రమేష్ భలేరావు పేరు మీద రూ. నాలుగు కోట్ల బీమా పాలసీ ఉంది. ఆ విషయం స్నేహితులకు తెలుసు. ఆ సొమ్ము మీద వారి కన్ను పడింది. ఎలాగైనా అర్జున్ ను చంపేసి ఆ డబ్బును కాజేయాలనుకున్నారు. దీనికోసం ఫ్రెండ్స్ పక్కా ప్లాన్ వేశారు. అయితే బీమా చేయించిన తర్వాత రమేష్ నాసిక్ లో లేడు. దీంతో వీరి ప్లాన్ వర్కౌట్ కాలేదు.

మూడేళ్ల తర్వాత ఇటీవలే రమేష్ నాసిక్ కి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేష్ ని హత్య చేశారు. భీమా డబ్బులు రావాలంటే, తాము దొరకకుండా ఉండాలంటే అది అది ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించాడని అందరికీ చెప్పారు. రమేష్ బైక్ మీద వెళ్తుంటే వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ట్లుగా చెప్పారు. పోలీసులు అలాగే కేసు నమోదు చేసుకున్నారు. 

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - అలహాబాద్ హైకోర్టు

అయితే అంతా బాగానే ప్లాన్ చేశారు కానీ సోము పంచుకునే విషయంలోనే ఐదుగురు నిందితులు మధ్య గొడవలు వచ్చాయి. ఈ గొడవలతో విసుగు చెందిన వారిలో ఒకరు.. రమేష్ సోదరుడికి అసలు విషయం చెప్పారు. అంతేకాదు... అర్జున్ రమేష్ భలేరావు భార్య రజినీ ఉకే పేరుతో ఓ మహిళ నకిలీ డాక్యుమెంట్ లను ఇచ్చి భీమా డబ్బులను మొత్తం తీసుకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు నుంచి తుపాకీ, 6 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు కోసం గాలిస్తున్నారు.