Asianet News TeluguAsianet News Telugu

coronavirus: టీనేజ‌ర్స్ కు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే 6.79 లక్షల మంది రిజిస్ట్రేషన్..

coronavirus: దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు.
 

Covid vaccination for teens starts today, 6.8 lakh register
Author
Hyderabad, First Published Jan 3, 2022, 6:48 AM IST

coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొనసాగుతోంది. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. భార‌త్ లోనూ గ‌త వారం రోజులుగా పాజిటివ్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18  సంత్స‌రాల లోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. కో-విన్ ప్లాట్‌ఫారమ్‌లో ఆదివారం రాత్రి 9 గంటల వరకు 15-18 ఏళ్ల మధ్య వ‌య‌స్సు గ్రూపు వారు 6.79 లక్షల మంది పిల్లలు కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోవ‌డానికి రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్ వారికి నేటి నుంచి (సోమ‌వారం) వ్యాక్సిన్ల‌ను అందించ‌నున్నారు. వీరికి హైద‌రాబాద్ కు చెందిన ఫార్మా దిగ్గ‌జం భారత్ బయోటెక్‌.. ఐసీఎంఆర్‌, ఫూణే వైరాల‌జీల స‌హాయంతో త‌యారు చేసిన క‌రోనా టీకా కోవాగ్జిన్ ఇవ్వ‌నున్నారు. దీనిని  28 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల్లో అందించాల్సి ఉంటుంది.

Also Read: UP Elections 2022: ఒక‌ప్పుడు నేర‌స్తుల‌కు అడ్డా.. నేడు క్రీడాకారుల గ‌డ్డ.. ! :ప్ర‌ధాని మోడీ

వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్న కేంద్రాల్లో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీని కోసం 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సిన్‌లను.. ఇప్ప‌టికే ఇస్తున్న ఏజ్ గ్రూప్ వారి టీకాల‌తో కలపకుండా ఉండేందుకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేక టీకా బృందాల‌ను రంగంలోకి దించుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం జారీ చేసింది. జనవరి 1 నుండి పిల్లలకు టీకాలు వేయడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించగా, మొదటి రోజు 15-18 సంవత్సరాల మధ్య 3.23 లక్షల మంది యువకులు నమోదు చేసుకున్నారు. సోమవారం నుండి నిర్దేశించిన టీకా కేంద్రాలల్లో కూడా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అనంత‌రం వారికి అక్క‌డ టీకాలు అంద‌జేస్తారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పుడు, మొదటి రెండు రోజుల్లో (ఏప్రిల్ 28 మరియు 29) దాదాపు 2.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. పెద్దలతో పోల్చితే ఇప్పటివరకు నమోదైన 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, రెండు వర్గాలకు సంబంధించిన సంఖ్య‌లో గ్యాప్ పెద్ద‌గానే ఉంద‌ని చెప్పాలి.

Also Read: Andhra Pradesh: జ‌గ‌న్ రెడ్డి కాదు.. జాదు రెడ్డి.. జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ‌?: నారా లోకేష్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 7.40 కోట్ల మంది టీకాలు వేసుకోవ‌డానికి అర్హులుగా ఉన్నారు. మరోవైపు క‌రోనా వ్యాక్సిన్ అందించిన 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల 55 కోట్ల  మంది ఉన్నారు. మొత్తంగా క‌రోనా వ్యాక్సిన్ అందించిన 18 ఏండ్ల‌కు పై బ‌డిన వారు 94 కోట్ల మంది ఉన్నార‌ని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక ప్ర‌స్తుతం టీనేజ్ వారు టీకాలు తీసుకునే విష‌యంలో  నిర్ణ‌యాధికారాలు ఎక్కువగా తల్లిదండ్రుల‌వే కాబ‌ట్టి..  వీరిలో చాలామంది ఇప్పటికీ పిల్లలకు టీకాలు వేయించ‌డానికి  భయపడుతున్నారని ఒక అధికారి తెలిపారు. "తల్లిదండ్రులు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. టీకాలు తీసుకోవ‌డానికి వ‌చ్చే వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంద‌ని మేము భావించాము. అయితే, ఇత‌ర దేశాల్లోని ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న వారు.. టీకాలు తీసుకోవ‌డానికి ఆసక్తి త‌క్కువ‌గా చూపిస్తున్నారు. అయితే, ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుంద‌నీ, టీకాలు తీసుకునే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది” అని అధికారి తెలిపారు. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 145.7 కోట్ల క‌రోనా టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. ఇందులో 90% కంటే ఎక్కువ మంది పెద్దలు కనీసం ఒక డోస్ ను తీసుకున్నారు.

Also Read: EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో వ‌చ్చే ఏడాదే మార్పులు: కేంద్రం

Follow Us:
Download App:
  • android
  • ios