UP Elections 2022: ఒక‌ప్పుడు నేర‌స్తుల‌కు అడ్డా.. నేడు క్రీడాకారుల గ‌డ్డ.. ! :ప్ర‌ధాని మోడీ

UP Elections 2022: త్వ‌ర‌లోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల బ‌రిలో నిలువ‌బోయే పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోడీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఒక‌ప్పుడు ఇది నేర‌స్తుల అడ్డా.. ఇప్పుడు క్రీడాకారుల గ‌డ్డ‌గా మారింద‌న్నారు. 

Previous regimes protected criminals, Yogi govt jails them, says PM Modi

UP Elections 2022: త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని పార్టీలు  ఈ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించి.. ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల స‌మరం మాములుగా లేదు. మ‌ళ్లీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రలో విస్తృతంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాలు జ‌రుపుతోంది. ఆయా కార్య‌క్ర‌మాల్లో బీజేపీ అగ్ర‌నేత‌లంద‌రూ పాల్గొంటున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని నేత‌లంద‌రూ వ‌రుస పెట్టి యూపీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఆదివారం నాడు ప్ర‌ధాని మోడీ సైతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. మీరట్‌లోని సర్ధనలో స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ఇందుకు ముందు కొన‌సాగిన ప్ర‌భుత్వాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ స‌వాలు విసురుతూ.. బ‌లంగా నిల‌బ‌డుతున్న స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రధానంగా టార్గెట్ చేసి.. విమ‌ర్శ‌లు చేశారు.

Also Read: Andhra Pradesh: జ‌గ‌న్ రెడ్డి కాదు.. జాదు రెడ్డి.. జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ‌?: నారా లోకేష్

ఒక‌ప్పుడు నేర‌స్థుల‌కు అడ్గాగా ఉన్న ఈ ప్రాంతం ప్ర‌స్తుతం క్రీడాకారుల‌కు గ‌డ్డ‌గా మారుతున్న‌ద‌ని అన్నారు.  నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని అన్నారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేదన్నారు. సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందేద‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వారితో టోర్నమెంట్‌లను ఆడుతూ బిజీగా ఉండేవారన్నారు. అయితే, రాష్ట్రంలో సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ నేర‌గాళ్ల‌ను  ‘జైలు’లో పెట్టి అడుకుంటున్నార‌ని అన్నారు. యోగి ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. "నేడు, యోగి ప్రభుత్వం యువకుల ప్రభుత్వ నియామకాలను రికార్డు చేస్తోంది. ఐటీఐ ద్వారా శిక్షణ పొందిన వేలాది మంది యువతకు బడా కంపెనీల్లో ఉపాధి కల్పించారు. నేషనల్ అప్రెంటీస్‌షిప్ స్కీమ్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి ప‌థ‌కాల‌తో లక్షలాది మంది యువత ప్రయోజనం పొందారు" అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

Also Read: EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో వ‌చ్చే ఏడాదే మార్పులు: కేంద్రం

అలాగే, నూతన జాతీయ విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చామ‌ని తెలిపారు. క్రీడలు ఇప్పుడు సైన్స్, కామర్స్ లేదా ఇతర అధ్యయనాల మాదిరిగానే గుర్తించ‌బ‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. గతంలో క్రీడలు అదనపు కార్యకలాపంగా పరిగణించబడేవి, కానీ ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్‌కు అంకితమైన సబ్జెక్ట్ ఉంటుంది అని తెలిపారు. "మన యువత ఇతర వృత్తుల మాదిరిగానే క్రీడలను చూడాలని కోరుకుంటున్నాను" అని మోడీ అన్నారు. ఇంతకుముందు సంపన్నులు మాత్రమే క్రీడా శిక్షణ పొందగలిగేవారు కానీ నేడు అంద‌రికీ స‌మానంగా క్రీడా అవ‌కాశాలు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మాట్లాడుతూ.. 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అల్లర్లు ఆగిపోయాయని అన్నారు. " 2017లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అల్లర్లు ఆగిపోయాయి.. ఆగిపోయిన కన్వర్ యాత్ర మళ్లీ మొదలైంది" అని అన్నారు. 

Also Read: cold wave: ఉత్త‌ర‌భార‌తంలో ఎముకలు కొరికే చ‌లి.. వ‌ణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios