Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh: జ‌గ‌న్ రెడ్డి కాదు.. జాదు రెడ్డి.. జాబ్ క్యాలెండ‌ర్ ఎక్క‌డ‌?: నారా లోకేష్

Andhra Pradesh: వైకాపా అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఏడాది ప్రారంభ‌మే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి మాట మార్చుడు.. మడమ తిప్పుడు కి బ్రాండ్ అంబాసిడర్  జ‌గ‌న్" అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 
 

Nara Lokesh Politics Satires on AP CM Jagan Mohan Reddy over Jobs
Author
Hyderabad, First Published Jan 2, 2022, 3:52 PM IST

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ  నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇరు పార్టీల నేత‌లు నిత్యం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. రెచ్చిపోయారు. ఆయ‌న పాదయాత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా..? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలండెర్ ఎక్కడ? అంటూ నిలదీశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ  మ‌ర్చిపోయారా?  అంటూ ప్ర‌శ్నించారు. ఉద్యోగాల విష‌యంలో ఇప్పుడు మాట మార్చుతున్నారని దుయ్యబట్టారు. మాటల మార్చుడు.. మడమ తిప్పుడుకి జగన్మోహ‌న్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఘాటు విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయారు.

Also Read: EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో వ‌చ్చే ఏడాదే మార్పులు: కేంద్రం

ట్విట్ట‌ర్ వేదిక‌గా నారా లోకేష్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. "ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు" అని లోకేష్ నిప్పులు చెరిగారు. మాట మార్చుడు.. మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వైఎస్ జ‌గ‌న్‌ మారార‌ని ఎద్దేవా చేశారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు ఉన్న కంపెనీలు పోకుండా ఉంటే చాలనుకునే రోజు తెచ్చారు జాదూ రెడ్డి అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  పాదయాత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరావడం లేదా అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Also Read: cold wave: ఉత్త‌ర‌భార‌తంలో ఎముకలు కొరికే చ‌లి.. వ‌ణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు !

అధికారంలోకి రాక ముందు 2.30 లక్ష‌ల ప్రభుత్వ ఉద్యోగాల‌తో జాబ్ క్యాలెండర్ అంటివి.. వచ్చిన తర్వాత మాత్రం ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి మాట మార్చుడు.. మడమ తిప్పుడు కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు @ysjagan. #APUnemploymentDay" అంటూ ట్వీట్ చేశారు.  ప్రతి జనవరి ఫస్ట్ కు జాబ్ క్యాలెండర్ లేదు.. అటు ప్రైవేటు ఉద్యోగాలు లేవు.. గతంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి కూడా లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సైతం జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావ‌స్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఎందుకు అమలు చేయడంలేదని ఆయ‌న ప్రశ్నించారు. 

Also Read: Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మ‌కానికి అమ్మాయిలు.. యాప్‌లో ఓ వ‌ర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !

 

Follow Us:
Download App:
  • android
  • ios