EWS: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS‌)లకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై ఇప్ప‌టికీ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నీట్ పీజీ ప‌రీక్ష‌ల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాపై దాఖ‌లైన పిటిష‌న్ నేప‌థ్యంలో.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో ఈ ఏడాది ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని కేంద్రం వెల్ల‌డించింది.  

EWS: దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల రిజర్వేషన్ (Economically Weaker Section) లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను ఈ విద్యా సంవత్సరానికి అలాగే ఉంచుతామని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS‌)లకు రిజర్వేషన్లను కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. అయితే, అంశంపై ఇప్ప‌టికీ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నీట్ పీజీ ప‌రీక్ష‌ల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాపై అంశంపై దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై ఈ వారంలోనే విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో ఈ ఏడాది ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఈ పిటిష‌న్ విచార‌ణ ఈ నెల 6న జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టులో త‌న స్పంద‌న‌లు తెలియ‌జేస్తూ.. త‌న అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అందులో ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. ఈ ఏడాది ఎలాంటి మార్ప‌లు చేయ‌డం లేద‌ని పేర్కొన్న కేంద్రం.. వ‌చ్చే ఏడాది సవరణలు చేస్తామని వెల్ల‌డించింది. 

Also Read: cold wave: ఉత్త‌ర‌భార‌తంలో ఎముకలు కొరికే చ‌లి.. వ‌ణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు !

సుప్రీంకోర్టులో కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ప్ర‌స్తావించిన మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తున్నామని కేంద్రం తెలిపింది. రిజర్వేషన్లు పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షలుగా కొనసాగనుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు. అయితే, ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది. ఇదిలావుండ‌గా, Economically Weaker Section కోటా నిర్ధార‌ణ కోసం 8 లక్షల రూపాయ‌ల ప‌రిమితిపైనా సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తూ.. కేంద్రానికి ప‌లు ప్ర‌శ్న‌లు సైతం సంధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం దాఖ‌లుచేసిన అఫిడ‌విట్ లో దీనిని స‌మ‌ర్థించుకుంది. నీట్‌-పీజీ పరీక్షల్లో Economically Weaker Section (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్‌ కోసం విధించిన రూ.8లక్షల ఆదాయ పరిమితిని కేంద్రం సమర్థించుకుంది. దీని వల్ల ఇప్పటి వరకు లబ్ధి పొందిన విద్యార్థుల పూర్వాపరాలను కమిటీ పరిశీలించిందని అఫిడవిట్‌లో పేర్కొంది. అర్హతలేని వారికి కూడా రిజర్వేషన్‌ ఫలాలు అందుతున్నాయన్న సమస్య ఉత్పన్నం కావడం లేదని వెల్ల‌డించింది.

Also Read: Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మ‌కానికి అమ్మాయిలు.. యాప్‌లో ఓ వ‌ర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !

Economically Weaker Section రిజ‌ర్వేష‌న్ కోటాలో ప్రస్తుతం ఈ నిబంధన వల్ల లబ్ధి పొందుతున్న వారిలో చాలా మంది రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న‌వారే ఉన్నార‌ని తెలిపింది. ఇదిలావుండ‌గా, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో Economically Weaker Section కోసం 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు గల అగ్ర కులాల పేదలకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు మినహా ఇతర జనరల్‌ కేటగిరీ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

Also Read: up assembly elections 2022: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: టైమ్స్ నౌ పోల్