Asianet News TeluguAsianet News Telugu

జనవరిలో కోవిడ్ ఉధృతి.. రాబోయే 40 రోజులు కీలకం - కరోనా వేవ్ పై ప్రభుత్వ అంచనా

దేశంలో కరోనా కేసులు వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వచ్చే 40 రోజులు చాలా ముఖ్యమైనవని పేర్కొంది. కరోనా కొత్త వేవ్ వచ్చినా ఇప్పటికే ఎక్కువ జనాభా వ్యాక్సిన్లు తీసుకొని ఉన్నందున, దాని ప్రభావం చైనాలో ఉన్నట్టుగా ఉండకపోవచ్చని తెలిపింది. 

Covid surge in January.. Crucial for next 40 days - Govt's estimate on Corona wave
Author
First Published Dec 29, 2022, 11:08 AM IST

భారత్ లో జనవరి నెలలో కోవిడ్ -19 కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాబోయే 40 రోజులు చాలా కీలకం అని, దేశంలో గత కరోనా వేవ్ సరళిని తెలియజేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం హెచ్చరించారు. అయితే కొత్త వేవ్ వచ్చినా, దాని తీవ్రత అధికంగా ఉండదని తెలిపారు.

కోవిడ్ పాజిటివ్ గా తేలిన అర్జెంటీనా టూరిస్ట్ మిస్సింగ్... తాజ్ మహల్ చూడడానికి వచ్చి...

అలాగే ఇంత వరకు లోపభూయిష్టమైన జీరో కోవిడ్ విధానాన్ని అనుసరించిన చైనాతో పోలిస్తే మన దేశంలో ఇప్పటికే చాలా మంది టీకాలు వేసుకున్నారు. దీంతో అధిక శాతం జనాభాకు హైబ్రిడ్ రోగనిరోధక శక్తి వచ్చింది. కాబట్టి హాస్పిటల్ లో చేరికలు, మరణాలు అధికంగా ఉండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. 

‘‘పూర్వ ఆసియాలో వేవ్ కనిపించినప్పుడల్లా 35-40 రోజుల్లో భారతదేశాన్ని కొత్త వేవ్ లు తాకడం గతంలో మనం చూసిన ధోరణి’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ -వేరియంట్ బీఎఫ్ 7 విజృంభించడం, ముఖ్యంగా చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది.

8నెలల్లో 46కేజీలు తగ్గిన పోలీసు అధికారి... ఎలా తగ్గాడో తెలుసా?

గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో స్క్రీనింగ్ చేసిన 6,000 మందిలో 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. హాట్‌స్పాట్‌ల దేశాల నుండి అంతర్జాతీయంగా వచ్చేవారిలో 2 శాతం మందికి తప్పనిసరి కోవిడ్ పరీక్ష గత శనివారం ప్రారంభమైంది.

వచ్చే వారం నుండి, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ విమానానికి 72 గంటల ముందు తీసుకున్న పరీక్షకు సంబంధించిన కోవిడ్-నెగటివ్ ఆర్టీ పీసీఆర్ నివేదికను తీసుకెళ్లడం తప్పనిసరి. ఈ ప్రతిపాదన ఈ వారంలోనే అధికారికంగా జరగాల్సి ఉంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కత్తితో బెదిరించి మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్.. నగ్నచిత్రాలు తీసి...

నవంబర్ 22 న ఎయిర్ సువిధ ఫారమ్‌లను తప్పనిసరిగా నింపడాన్ని నిలిపివేసిన ప్రభుత్వం.. ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడం ప్రారంభిస్తే దానిని తిరిగి తీసుకురావచ్చు. ఎయిర్ సువిధ అనేది సెల్ఫ్-డిక్లరేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఫారమ్. ఇది నివారణ చర్యగా పరిచమైంది. దీని వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్‌లో కూడా ఎంతో సులభమైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios