Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ పాజిటివ్ గా తేలిన అర్జెంటీనా టూరిస్ట్ మిస్సింగ్... తాజ్ మహల్ చూడడానికి వచ్చి...

తాజ్ మహల్ వద్ద జరిపిన స్క్రీనింగ్ టెస్టులో ఓ అర్జెంటీనా టూరిస్ట్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే అతను తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో కనుక్కోవడం కష్టంగా మారింది. 

Argentina Tourist Missing After Testing Covid Positive At Taj Mahal
Author
First Published Dec 29, 2022, 11:03 AM IST

ఆగ్రా : డిసెంబరు 26న తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వచ్చిన అర్జెంటీనాకు చెందిన ఒక పర్యాటకుడికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. అయితే, ఆ తరువాత ఆ టూరిస్ట్ కనిపించకుండా పోయాడని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) డాక్టర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తెలిపారు. తాజ్ మహల్ వద్ద స్క్రీనింగ్ సమయంలో పర్యాటకుల నమూనాలను సేకరించారు. యాంటిజెన్ పరీక్షలో పాజిటివ్ గా తేలడంతో అతడిని తాజ్ మహల్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు.

ఈ విదేశీ యాత్రికుడు తప్పుడు తన వివరాలను తప్పుగా  అందించాడని, అధికారులు, పోలీసుల సహాయంతో అతన్ని గుర్తించడం జరుగుతుందని డాక్టర్ శ్రీవాస్తవ చెప్పారు.

"తాజ్ మహల్‌ను సందర్శించడానికి వచ్చిన ఒక అంతర్జాతీయ పర్యాటకుడికి డిసెంబర్ 26న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. యాంటిజెన్ పరీక్షలో పాజిటివ్ రావడంతో తాజ్ మహల్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. అతను మాకు తప్పుడు సంప్రదింపు వివరాలను ఇచ్చాడు. స్థానిక అధికారులు, పోలీసుల సహాయంతో అతడు ఎక్కుడున్నాడో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏఎస్ఐ, చుట్టుపక్కల హోటళ్ల సహాయంతో తప్పిపోయిన వ్యక్తి వివరాలను సేకరించే ప్రయత్నం జరుగుతుంది”అని చెప్పారు.

వృద్ధుడి కోసం నీళ్లు అడిగినందుకు దళితుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు.. మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

అంతకుముందు, చైనా నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి డిసెంబర్ 25 న తాజ్ మహల్ వద్ద COVID-19 పాజిటివ్ అని తేలింది. "కొన్ని రోజుల క్రితం చైనా నుండి తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి ఆగ్రాలో కరోనా పాజిటివ్ తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనా లక్నోకు పంపించాం. అతను చైనా నుండి వచ్చినందున జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. అతను డిసెంబర్ 22 న భారతదేశంలో ల్యాండ్ అయ్యాడు. 23 అతను ఆగ్రా చేరుకున్నాడు. మేము అతను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే, వచ్చినప్పటి నుండి ఎక్కువ సమయం అతను తన గదిలోనే ఉన్నందున చాలా మందితో కలిసే అవకాశం లేదు" అని డాక్టర్ శ్రీవాస్తవ చెప్పారు.

చైనాతో సహా పలు దేశాల్లో కోవిడ్-19 విజృంభిస్తున్న దృష్ట్యా, భారత్‌లో కూడా హెచ్చరిక జారీ చేయబడింది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ఆగ్రా రైల్వే స్టేషన్, బస్టాండ్లు,  విమానాశ్రయంలో పరీక్షలను వేగవంతం చేశారు. ఆగ్రాలోని ఆరోగ్య అధికారులు తాజ్ మహల్, ఇతర స్మారక చిహ్నాల వద్ద సందర్శకులను పరీక్షిస్తున్నారు. వారి ప్రయత్నాలను ప్రధానంగా విదేశీ పర్యాటకులపై కేంద్రీకరించారు.

ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు దేశ, విదేశీ పర్యాటకులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారి సందర్శనకు ముందు వారు కోవిడ్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. జిల్లా ఆరోగ్య సమాచార అధికారి (ఆగ్రా) అనిల్ సత్సంగి మాట్లాడుతూ, "ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ ఇప్పటికే పరీక్షలను ప్రారంభించింది, అప్రమత్తంగా ఉండడం కోసం, సందర్శకులందరికీ పరీక్షలు తప్పనిసరి చేయబడ్డాయి."

మంగళవారం, ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లోని 400 ఆసుపత్రులలో మాక్ డ్రిల్స్ నిర్వహించబడ్డాయి, ఇందులో వెంటిలేటర్లు, మందులు, ఆక్సిజన్ లభ్యతపై దృష్టి సారించారు.

Follow Us:
Download App:
  • android
  • ios