Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో పెరుగుతున్న కోవిడ్.. ఒకే రోజులో 1,071 కొత్త కేసులు నమోదు.. 129 రోజుల తరువాత అత్యధికం

దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 129 రోజుల తరువాత గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో కొత్తగా 1,071 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారి వల్ల ముగ్గురు మరణించారు. 

Covid on the rise in India.. 1,071 new cases registered in a single day.. Highest after 129 days ISR
Author
First Published Mar 19, 2023, 1:11 PM IST

భారత్ లో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ఇటీవల కాలం నుంచి ఈ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసులు ఒక్క సారిగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం . దేశంలో గత 24 గంటల్లో 1,000 కి పైగా కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5,915 కు చేరాయి. 

రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు.. ‘ఆ బాధిత మహిళల వివరాలివ్వండి’

హెల్త్ మినిస్ట్రీ ఆప్ డేట్ చేసిన వివరాల ప్రకారం.. భారతదేశంలో 129 రోజుల తర్వాత ఒకే రోజు 1,071 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య 5,915 కు పెరిగాయి. 24 గంటల్లో ఈ కరోనా వల్ల మూడు మరణాలు సంభవించాయి. ఇందులో రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలలో ఒకటి చొప్పున మరణం నమోదు అయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,802 కు పెరిగింది. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివరాల ఆధారంగా ఇప్పటి వరకు దేశంలో సంక్రమణ సంఖ్య 4.46 కోట్లు (4,46,95,420)గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.01 శాతంగా ఉండగా.. జాతీయ కొవిడ్-19 రికవరీ రేటు 98.8 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,703కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

2024లో బీజేపీని ఓడించడంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర - సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్

దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ తెలిపింది. కాగా.. కోవిడ్-19 ఎక్స్‌బీబీ వేరియంట్‌లోని సబ్-వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 ఇటీవల భారత్ లో కేసుల పెరుగుదలకు కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని ‘ఆజ్ తక్’ నివేదించింది. వేరియంట్‌లను పర్యవేక్షించే అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్ దగ్గర శుక్రవారం నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. కరోనా ఎక్స్ బీబీ వేరియంట్ అత్యధిక కేసులు భారతదేశంలో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు భారత్ లో ఈ కేసులు 48 ఉండగా. సింగపూర్ లో 14, యూఎస్ లో 15 నమోదయ్యాయి.

ఏషియానెట్ న్యూస్‌కు భారీ విజయం: వార్త రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను జైలులో పెట్టలేమన్న కోర్టు..

పెరుగుతున్న కరోనా కేసుల వల్ల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్ అయ్యింది. కరోనా కేసులు హఠాత్తుగా పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంపై ఫోకస్ పెట్టాలని తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ మూడు రోజుల కిందట లేఖ రాసింది. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. వెంటనే ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రీటింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. స్థానికంగా కేసులు ఒక్క ఉదుటన పెరిగే ముప్పు ఉన్నదని, కాబట్టి, ఆకస్మికంగా కేసుల విస్ఫోటనం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios