Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు.. ‘ఆ బాధిత మహిళల వివరాలివ్వండి’

రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. తాము నిత్యం లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నామని చెప్పుుకున్న మహిళల వివరాలు ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరారు. తద్వార ఆ మహిళలకు తాము రక్షణ కల్పిస్తామని చెప్పారు. శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యల ఆధారంగా ఆయనకు పోలీసులు నోటీసులు పంపారు. తాజాగా, ఆయన నివాసానికే వెళ్లారు.
 

delhi police at rahul gandhi residence seeking details of victims of sexual assault
Author
First Published Mar 19, 2023, 12:59 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులపై స్పందించాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ శ్రీనగర్‌లో ఇచ్చిన ప్రసంగంలో ఎందరో మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారని కామెంట్ చేశారని, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిపారు. ఆ మహిళల వివరాలు అందిస్తే వారిని రక్షిస్తామని వివరించారు.

శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తాను భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు ఎందరో మహిళలు తనను కలిశారని, వారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, దాడులను తనకు చెప్పుకుని రోధించారని చెబుతున్న వీడియోలు, మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని భారత్ జోడో యాత్ర ముగిసిన 45 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. మోడీ, అదానీల మధ్య సంబంధాన్ని పోలీసుల వెనుక ప్రభుత్వం దాచిపెడుతున్నదని ఈ నోటీసులను పేర్కొంటూ కాంగ్రెస్ విమర్శించింది. యాత్ర పూర్తయిన 45 రోజులకు నోటీసులు పంపి.. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు రాహుల్ గాంధీతో చెప్పుకున్న మహిళల వివరాలు ఇస్తే తాము వారిని రక్షిస్తామని పోలీసులు నోటీసులు పంపి పేర్కొన్నారని తెలిపింది. 

Also Read: ఓ తాతగారూ మీరింకా వున్నారా? : కాంగ్రెస్ నేత వీహెచ్‌పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్

ఈ నోటీసులకు తాము చట్టబద్ధంగా స్పందిస్తామని, ప్రభుత్వం భయపడుతున్నదని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ అని పేర్కొంది. కాగా, ఈ నోటీసులకు కాంగ్రెస్ స్పందించలేదని, అందుకే తాము నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నామని పోలీసులు వివరించారు. తాము బయట అతని కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం ఇచ్చామని రాహుల్ గాంధీ నివాసం వద్ద విలేకరులతో స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యల పై విమర్శలు చేస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios