Assembly Election 2022: ఉత్తరాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!
Uttarakhand Assembly Election 2022: వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. అయితే, గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలవరం రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీలో మార్పులు చేయాల్సిందేనంటూ రావత్ పేర్కొన్నారు.
Uttarakhand Assembly Election 2022: వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. అయితే, పలు పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీలకు ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ లోనూ ఈ తరహా పరిస్థితులు నెలకొనడం.. కాంగ్రెస్ లో అలజడి రేపుతున్నది. ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీష్ రావత్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉత్తరాఖండ్ ఎన్నికల్లో గెలావాలంటే.. ముందుగా కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేయాలనీ, లేకుండా అంతే సంగతులంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలపై ఇటీవలే పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ... విమర్శల దాడి కొనసాగించిన హరీష్ రావత్.. కొన్ని సార్లు తమకు కలిగిన బాధను వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్న ఆయన.. పార్టీలో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు.
Also Read: వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు
"రాబోయే ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. ఏఐసీసీ సర్వోన్నత కమాండ్. రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. కెప్టెన్‌గా వ్యవహరించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ ముగ్గురి మధ్య విశ్వాసం, సమన్వయం ఉండాలి. క్రాస్ పర్పస్‌తో ఆడితే మ్యాచ్ ఓడిపోతాం. కొన్నిసార్లు నొప్పిని భరించడం పార్టీకి ప్రయోజనకారిగా ఉంటుంది" అని హరీష్ రావత్ పేర్కొన్నారు. అలాగే, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఎన్నికల నేపథ్యంలో తాను ప్రచార సారథిగా ఉంటాననీ, తన బాధ్యతను నెరవేర్చడంలో అందరూ నాకు సహకారం అందిస్తారంటూ వెల్లడించారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ, అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనే విషయం గురించి ఆయన ఇటీవల కలిసినప్పుడు ప్రస్తావించారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ‘సమిష్టి నాయకత్వం’లోనే ఎన్నికలు జరుగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
Also Read: రామతీర్ధం ఘటనలో వైసీపీ, టీడీపీలదే బాధ్యత.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
ఇదిలావుండగా, అంతర్గతంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ ను కలవరానికి గురిచేస్తున్నదని తెలుస్తోంది. ఇటీవల హరీష్ రావత్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా ఉన్నాయి. హరీష్ రావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా, ‘ఎన్నికల సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లాల్సి ఉంది. నేను ఈదుతున్నప్పుడు సొంత పార్టీ నేతలే వెనక్కు నెట్టుతున్నారు, నా కాళ్లు, చేతులు కట్టేస్తున్నారు. నాపైకి మొసళ్లను వదులుతున్నారు. చాలాకాలం నుంచి ఈత కొడుతున్నాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతాగే, ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే తాను ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తన అంతరాత్మ చెబుతున్నదనీ, కేదారేశ్వరుడే దీనికి ఒక మార్గం చేపుతాడని కూడా పేర్కొన్నాడు. వచ్చే రెండుమూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ కలవరం మొదలైంది. వెంటనే ఆయనను హస్తినకు పిలిచింది. ఈ తర్వాత కూడా ‘సమయం వచ్చినప్పుడు, నేను మీతో అన్ని చెబుతాను. నేను మీతో మాట్లాడకపోతే.. నేను ఎవరితో మాట్లాడతాను?’ అంటూ హరీష్ రావత్ అనడం గమనార్హం.
Also Read: Christmas 2021: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు !