రామతీర్ధం ఘ‌ట‌న‌లో వైసీపీ, టీడీపీలదే బాధ్య‌త.. బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

Andhra Pradesh: బీజేపీ లీడ‌ర్ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి అధికార వైకాపా, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల‌పై ఫైర్ అయ్యారు. విజయనగరంలోని రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన ఘటనకు వైకాపా, టీడీపీలే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. అలాగే, సినిమా టిక్కెట్, బ‌స్ టిక్కెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

bjp leader vishnuvardhan reddy fires on ysrcp and tdp

Andhra Pradesh:  తెలుగురాష్ట్రాల్లో పాగ వేయాల‌ని చూస్తున్న బీజేపీ దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుని ముందుకు సాగుతున్న‌ది. ఈ విష‌యంలో తెలంగాణ‌లో కాషాయం పార్టీ కొద్దిగా స‌క్సెస్ అయింద‌ని చెప్పాలి. ఏపీలోనూ దూకుడు పెంచాల‌ని భావిస్తున్న‌ట్టుగా తెలుస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల వివాద‌స్ప‌దం అయిన అంశాల‌ను బీజేపీ నాయ‌కులు తెర మీద‌కు తీసుకువ‌స్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైకాపా, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర బీజేపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి వైకాపా, టీడీపీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని పేర్కొన్నారు. రామతీర్థం లో చోటుచేసుకున్న ఘటన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు బాధ్యత వహించాలని  అన్నారు.

Also Read: Christmas 2021: ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు.. రాష్ట్రప‌తి, ప్ర‌ధాని స‌హా ప్ర‌ముఖుల‌ శుభాకాంక్షలు !

హిందువుల ప‌ట్ల ప్ర‌భుత్వ తీరు దారుణంగా ఉంద‌ని ఆరోపించారు.  విజయనగరంలోని రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో చోటుచేసుకున్న గొడవపై  ప్ర‌భుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదనీ, ఇది హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్న‌ద‌ని విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హిందూ  దేవాల‌యాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్న‌ద‌నీ, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆల‌యాల అభివృద్థికి నిధులు కేటాయించాల‌ని తెలిపారు.  అలాగే, ఇటీవ‌ల తీవ్ర వివాద‌స్ప‌ద‌మైన సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారాన్ని సైతం ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  సినిమా టికెట్లు సరే .. ఆలయాల దర్శనం టికెట్లు, సంక్రాంతి బస్సు టికెట్ల ధరలు తగ్గించరా? అంటూ ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. అధికార వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల అంశాన్ని అనవసరపు రాద్ధాంతం చేస్తోందని అన్నారు. రాజ‌కీయం కోస‌మే అంశ‌న్ని వివాదంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధరల పై పెట్టిన శ్రద్ధ రానున్న సంక్రాంతి నేపథ్యంలో బస్సు టికెట్ల ధరలు, ఆలయాల్లో దర్శన టికెట్ల ధరలను తగ్గించడంపై పెట్టాలని ప్ర‌భుత్వానికి సూచించారు.

Also Read: సీబీఐకి ఆ అధికారం లేదు.. ఛార్జిషీట్ ను హైకోర్టులో స‌వాలు చేసిన ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి

అన‌వ‌స‌రంగా ప్ర‌భుత్వం కొన్ని విష‌యాలు తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్న‌ద‌ని అన్నారు. దీని వెనుక రాజ‌కీయ ల‌బ్ది దాగుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే సినిమా థియేట‌ర్ల టిక్కెట్ ధ‌ర‌ల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చింద‌ని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్లపై అధికారులు దాడులు చేస్తున్నారని, ఇప్పుడు ఇంతగా దాడులు చేస్తున్న ప్రభుత్వం, అంతకు ముందంతా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తారని వాటిని పక్కదారి పట్టించడం కోసం లేని సమస్యలను అధికార పార్టీ సృష్టిస్తున్న‌ద‌ని విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ఆరోపించారు.  ఇదిలావుండ‌గా, బీజేపీ మ‌ళ్లీ రామ‌తీర్థం అంశాన్ని లెవ‌నెత్తుతుండ‌టం రాజ‌కీయ హీటును పేంచే విధంగా క‌నిపిస్తోంది. ఆలయ సంప్రదాయాలను పాటించకుండా మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారిని, కనీసం తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. వైసీపీ మంత్రులు కావాలని అశోక్ గజపతిరాజు వివాదం చేశారని ఆయన పై మండిపడగా, టీడీపీ నేతలు వైసీపీ మంత్రులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ప్ర‌స్తుతం వైసీపీ, టీడీపీల మ‌ధ్య రామ‌తీర్థం వార్ న‌డుస్తుండ‌గా, బీజేపీ రెండు పార్టీల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఈ వార్ మ‌రింత ముద‌ర‌నుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Also Read: ఏకంగా నకిలీ ఆధార్ లు త‌యారీ.. 8 మంది కేటుగాళ్ల అరెస్ట్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios