Asianet News TeluguAsianet News Telugu

Christmas 2021: ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు.. రాష్ట్రప‌తి, ప్ర‌ధాని స‌హా ప్ర‌ముఖుల‌ శుభాకాంక్షలు !

Christmas 2021: దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ మిరుమిట్లు గొలిపే రంగురంగుల పూలు, లైట్లతో, క్రిస్మస్ ట్రీలతో అలంకరించబడి.. పండగ కళతో వెలిగిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాగా.. రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్, ప్ర‌ధాని మోడీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు దేశ ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 
 

Merry Christmas 2021: PM Modi Greets Nations On Christmas
Author
Hyderabad, First Published Dec 25, 2021, 11:06 AM IST

Christmas 2021: దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ మిరుమిట్లు గొలిపే రంగురంగుల పూలు, లైట్లతో, క్రిస్మస్ ట్రీలతో అలంకరించబడి.. పండగ కళతో వెలిగిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న స‌మ‌యంలో జ‌రుపుకుంటున్న రెండో క్రిస్మ‌స్ వేడుక‌లు ఇవి. దేశంలో ఇప్ప‌టికీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కొన‌సాగుతుండటంతో పాటు కొత్త‌గా వెలుగుచూసిన ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ.. క్రిస్మ‌స్ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. దేశంలోని అన్ని చ‌ర్చీలు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ..క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే దేశ ప్ర‌థ‌మ పౌరుడు, రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవిండ్, ప్ర‌ధాని నరేంద్ర మోడీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు దేశ ప్ర‌జ‌ల‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవిండ్ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. జీవితంలో చిన్న చిన్న విష‌యాల‌కు సైతం విలువ‌నివ్వాల‌నీ, పేద‌ల‌కు సాయంగా నిల‌వాల‌ని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు ఆదర్శాలు, బోధనలను తమ జీవితాల్లో స్వీకరించడం ద్వారా న్యాయం, స్వేచ్ఛ  విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని కోవింద్ పౌరులను కోరారు. "క్రిస్మస్ శుభ సందర్భంగా, తోటి పౌరులందరికీ, ముఖ్యంగా మన క్రైస్తవ సోదరులు,  సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాష్ట్రప‌తి" పేర్కొన్నారు.

Also Read: సీబీఐకి ఆ అధికారం లేదు.. ఛార్జిషీట్ ను హైకోర్టులో స‌వాలు చేసిన ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి

ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్ష‌లు తెలిపారు. యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, సేవ, దయ యేసుక్రిస్తు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.  యేసు జీవితం, బోధనలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆయూరారోగ్యాలతో సామరస్యంతో జీవించాలని ప్ర‌ధాని మోడీ ఆకాంక్షించారు.  ఇదిలావుండ‌గా, దేశంలోని చాలా ప్రాంతాల్లో క్రిస్మ‌స్ తో పాటు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాయి ప్ర‌భుత్వాలు. క‌రోనా కొత్త వేరియంట్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది అంచ‌నాలుండ‌టం, భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు పెర‌గడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  క‌రోనా వైర‌స్ నిబంధ‌న‌లు పాటిస్తూనే..  గోవా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కర్నాట‌క‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రార్ధనలు జరిగాయి.  మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టంతో ఉద‌యం ఆరు గంట‌ల త‌రువాత ఆయా రాష్ట్రాల్లో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షల నేపథ్యంలో నిర్వాహకులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

Also Read: ఏకంగా నకిలీ ఆధార్ లు త‌యారీ.. 8 మంది కేటుగాళ్ల అరెస్ట్ !

ఇక దేశ‌రాజధాని ఢిల్లీలో  క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై నిషేధించటంతో అక్కడ సెల్రబేషన్స్ పైన ప్రభావం పడింది. దీంతోపాటు స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అధికారులు ఆంక్ష‌లు విధించారు. దీంతో అక్క‌డి చర్చిలలోకి ఎవరినీ అనుమతించలేదు. చాందినీ చౌక్​లోని బాప్టిస్ట్ చర్చి, గోల్ మార్కెట్​లోని సేక్రడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలను మూసేశారు. అయితే, కొంతమంది భక్తులు చర్చి బయట ప్రార్థనలు కొన‌సాగించారు. మహారాష్ట్రలోనూ చర్చిల సామర్థ్యంలో 50శాతం వరకే అనుమతితో వేడుక‌లు జ‌రిగాయి. కోల్​కతాలోని సెయింట్ థెరిసా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ‌లోకి మెదక్ చ‌ర్చీలోనూ క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ.. క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. 

Also Read: మోక్షం అంటూ... మూఢత్వంతో కుటుంబాన్ని బలితీసుకున్న వ్య‌క్తి

Follow Us:
Download App:
  • android
  • ios