Asianet News TeluguAsianet News Telugu

హైటెక్ వ్యభిచారం.. చిక్కుల్లో సినీ నటి

రోజుకు రూ. 30 వేల నుండి రూ. 3 లక్షల దాకా సంపాదించుకోవచ్చు’ అనే సందేశం వుంది. తొలుత జయలక్ష్మి దీన్ని తేలికగా తీసుకున్నారు.

Cops arrest duo for making indecent proposal to actress


సినీతారల ఫోటోలను ఎరగా వేసి.. విఠులను ఆకర్షిస్తూ.. హైటెక్ వ్యభిచారం నిర్వహించే బ్రోకర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇలాంటి ఓ బ్రోకర్ చేసిన పని కారణంగా తమిళ సినీ నటి జయలక్ష్మి చిక్కుల్లో పడ్డారు. 

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ సినీ హీరోయిన్లను డేటింగ్‌కు పంపుతామని ప్రచారం చేస్తూ హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

ఆ బ్రోకర్ల సెల్‌ఫోన్లలో సుమారు 70 మంది తమిళ సినీ, టీవీ హీరోయిన్ల ఫోటోలు, వారి మొబైల్‌ నెంబర్లు, వారితో డేటింగ్‌కు చెల్లించాల్సిన రేట్ల వివరాలు చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. జయలక్ష్మి సుమారు 30 చిత్రాల్లో నటించారు. కొద్ది రోజుల ముందు ఆమె మొబైల్‌కు ఓ వాట్సప్‌ సందేశం వచ్చింది.
 
అందులో ‘మీరు మంత్రులు, వీఐపీలతో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ దిగువ పేర్కొన్న ‘రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌’ సంస్థ ఫోన్‌ నెంబర్లకు ఫోన్‌ చేయండి.. రోజుకు రూ. 30 వేల నుండి రూ. 3 లక్షల దాకా సంపాదించుకోవచ్చు’ అనే సందేశం వుంది. తొలుత జయలక్ష్మి దీన్ని తేలికగా తీసుకున్నారు.

ఆ తర్వాత సంస్థ ప్రతినిధులమంటూ ఇద్దరు వ్యక్తులు అదే పనిగా ఫోన్‌ చేసి మంత్రులు, ప్రముఖులు ఆమెతో ఉల్లాసంగా గడిపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒప్పుకుంటే రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లిస్తామని తెలిపారు. దీంతో ఆమె నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాధన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు కవియరసు, మురుగపెరుమాళ్‌ అనే బ్రోకర్లను అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios