Asianet News TeluguAsianet News Telugu

నాకు ఫ్రీ ఫుడ్ ఇవ్వవా? రెస్టారెంట్ సిబ్బందిపై పోలీసు దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్

ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లోకి అర్ధరాత్రి వెళ్లిన ఓ పోలీసు అధికారి వీరంగం సృష్టించాడు. తనకు ఫ్రీగా ఫుడ్ కావాలని డిమాండ్ చేశాడు. కానీ, అది క్లోజింగ్ అవర్స్ అని, అప్పటికే కిచెన్ క్లోజ్ అయిందని మేనేజర్ చెప్పడంతో పోలీసు ఆగ్రహించాడు. ఆయన సమాధానికి ప్రతిసమాధానంగా పిడిగుద్దులు కురిపించాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది అప్రమత్తమై కొంత దూరం తీసుకుపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

cop attacked restaurant manager as food rejected
Author
Mumbai, First Published Dec 24, 2021, 6:05 AM IST

ముంబయి: ఆ పోలీసు(Police) ప్రజలకు రక్షణగా నిలవడం కాదు.. వారి నుంచి అక్రమంగా దోచుకోవడం ప్రారంభించాడు. కాదంటే ప్రజలపైనే దాడి చేసేలా ఉన్నాడు. ఇలాంటి పోలీసు అధికారుల వల్లే ఇతర సిన్సియర్ అధికారులపైనా వేళ్లు లేస్తుంటాయి. ముంబయికి చెందిన ఓ పోలీసు అధికారి అర్ధరాత్రి ఓ రెస్టారెంట్‌(Restaurant)లోకి వెళ్లి ఫ్రీగా ఫుడ్(Food) ఇవ్వాలని ఆర్డర్ వేశాడు. కానీ, ఆపాటికే కిచెన్ మూసేశారు. దీంతో ఫుడ్ లేదని మేనేజర్ చెప్పాడు. దీంతో ఆ పోలీసు అధికారి తీవ్రంగా ఆగ్రహించాడు. ఫుడ్ లేదని చెప్పిన మేనేజర్‌పై దాడి(Attack) చేశాడు. ఇతర సిబ్బంది వచ్చి అతన్ని ఆపినా దాడి చేస్తూనే ఉన్నాడు. మేనేజర్‌పై పోలీసు దాడి చేస్తుండగా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పోలీసు తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ విక్రమ్ పాటిల్ అర్ధరాత్రి సాంటాక్రజ్ ఈస్ట్‌లోని స్వాగత్ డైనింగ్ బార్‌లోకి వెళ్లాడు. అప్పటికే ఆ డైనింగ్ బార్ క్లోజ్ చేస్తున్నారు. విక్రమ్ పాటిల్ ఆ రెస్టారెంట్‌లోకి కిచెన్ గుండా ఎంటర్ అయ్యాడు. తనకు ఫుడ్ కావాలని డిమాండ్ చేశాడు. ఆయన మద్యం సేవించి వచ్చినట్టు కనిపించాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాగా, కౌంటర్‌పై ఉన్న మేనేజర్ గణేష్ పాటిల్ ఆయనకు సమాధానం చెప్పాడు. ఇప్పుడు సమయం 12.35 గంటలు అవుతున్నదని, కిచెన్ అప్పుడే క్లోజ్ చేశారని ఏసీపీ విక్రమ్ పాటిల్‌కు స్పష్టంగా తెలిపాడు. కానీ, ఈ సమాధానంతో విక్రమ్ పాటిల్‌కు ఆగ్రహం తన్నుకు వచ్చింది.

Also Read: చిత్తూరు జిల్లాలో మహిళపై బెల్ట్‌తో ఎస్ఐ దాడి: బాధితురాలి ధర్నా

ఆ సమాధానాన్ని ఆయన స్వీకరించే దశలో లేడు. తనకు ఫుడ్ లేదని చెబుతావా? అనే తీరులో మేనేజర్‌పై ఏసీపీ విక్రమ్ పాటిల్ విరుచుకుపడ్డాడు. ఈ గలాటను రెస్టారెంట్ సిబ్బంది గమనించారు. ఏసీపీ విక్రమ్ పాటిల్ చేయి చేసుకోగానే వెంటనే పరుగున వచ్చారు. ఏసీపీ విక్రమ్ పాటిల్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. కొంత మంది ఆయనను పట్టుకున్నప్పటికీ మేనేజర్ గణేష్ పాటిల్‌పై దాడి చేశాడు. ఈ ఘటన జరుగుతుండగా మేనేజర్ గణేష్ పాటిల్ కౌంటర్ పై కూర్చుండే ప్రాంతంలోనే ఉన్న సీసీటీవీ రికార్డు చేసింది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించారనే నెపంతో పదేళ్ల కొడుకు ముందే ఒ వ్యక్తిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ పిల్లాడు వేడుకొంటున్నా కూడ పోలీసులు వినలేదు. తండ్రితో పాటు కొడుకును కూడ  పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనను రికార్డు చేసిన ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  నిబంధనలను ఉల్లఘిస్తూ మోటార్ బైక్ తన పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు.నిబంధనలను ఉల్లంఘించారని ఆ వ్యక్తిని చితకబాదారు.

Follow Us:
Download App:
  • android
  • ios