న్యూఢిల్లీ:ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం  తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేసింది కేంద్రం. అంతేకాదు జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

370 ఆర్టికల్ రద్దును  కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన కొన్ని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు  ఈ పిటిషన్లను దాఖలు చేశాయి.ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉంది. ఈ పిటిషన్ పై అక్టోబర్ మాసంలో విచారణ జరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో పర్యటనకు సీతారాం ఏచూరికి సుప్రీం అనుమతి

కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

ఇండియన్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. కశ్మీరీ యువతిపై కేసు

కోలుకుంటున్న కాశ్మీరం: సోమవారం నుంచి తెరచుకోనున్న విద్యాసంస్థలు

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టుకెక్కిన ఒమర్ అబ్దుల్లా పార్టీ