న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోపర్యటించేందుకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటించేందుకు ప్రయత్నిస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయనను అడ్డుకొన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై బుధవారం నాడు కోర్టు విచారించింది. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామిని అరెస్ట్ చేశారు  యూసుఫ్ తరిగామిని పరామర్శించనున్నారు. మరో వైపు కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించేందుకు అందరికీ అవకాశం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ వ్యాఖ్యానించారు. యూసుఫ్ తరిగామి కుల్‌గామ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు.

సీతారామ్ ఏచూరి పర్యటనను సొలిసిటర్ జనరల్ వేణుగోపాల్ అభ్యంతరం చేశారు.రాజకీయ అనిశ్చిత పరిస్థితులు సృష్టించేందుకు అవకాశం ఉందన్నారు. అయితే  ఈ పర్యటనను రాజకీయంగా ఉపయోగించుకోకూడదని ఏచూరికి సుప్రీంకోర్టు సూచించింది.