భారత ఆర్మీపై సంచలన ఆరోపణలు చేసి ఓ కశ్మీరీ యువతి క్రిమినల్ కేసులో ఇరుక్కుంది. జమ్మూకశ్మీర్ తో పాటు దేశం మొత్తాన్ని నిత్యం రక్షిస్తున్న ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ఆరోపణల ఫలితంగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదయ్యింది.

ఇంతకీ మ్యాటరేంటంటే...  జమ్మూ కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ  విద్యార్థిని నాయకురాలు, స్థానిక యువతి షెహ్లా రషీద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా... ఆమె చేసిన ఆరోపణలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. 

ఆమె ఆరోపణలు అర్థరహితమని.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. యువతి చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.  అయితే.. ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ కావడంతో  ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

భారత ప్రభుత్వంపై, ఆర్మీపై నిరాధార ఆరోపణలు చేశారని... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కశ్మీర్ మూవ్ మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ కశ్మీర్ వదిభజనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై వివాదాస్పద ఆరోపణలు చేశారు.

ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని... యువకులను అర్థరాత్రి సమయంలో ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకువెళుతున్నారని... పలువురిని గృహనిర్భందానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగానే ఇప్పుడు ఆమెపై క్రిమినల్ కేసు నమోదయ్యింది.