వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోతుందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ జోస్యం చెప్పారు. ఆ పార్టీకి 30-35 సీట్లు వస్తాయని, మరో సారి కూడా ప్రతిపక్ష హోదాలోనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్ష బెంచ్‌లలోనే కొనసాగుతుందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ‘‘ వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకోవడం కూడా కష్టం. నా అంచనా ప్రకారం 2024లో ఆ పార్టీ దాదాపు 30-35 సీట్లే గెలుచుకోవచ్చు.’’ అని శర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి వేవ్ కొనసాగుతుందని సీఎం తెలిపారు.
ఎన్నికల్లో నాయకుల కుటుంబాలకు కాదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత - బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై రెండు పార్టీలు అంతకుముందు రోజు వాగ్వాదానికి దిగాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పట్టుబట్టగా, ప్రతిపక్ష నాయకులు ఎలాంటి తప్పు చేయకుండా కోర్టుకు దానిని వివరించాలని బీజేపీ నాయకులు సూచించారు.
ఈ నేపథ్యంలో హిమంత బిస్వా శర్మ కూడా కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను నిషేధించాలని పిలుపునిచ్చారు. ‘‘మనమెప్పుడూ మతపరమైన ఉద్రిక్తతలో PFI ప్రమేయం ఉండటం చూస్తూనే ఉంటాము. తాజా బటాద్రవ సంఘటనలో (ఒక గుంపు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టడం) కూడా PFI ప్రమేయం ఉందని మాకు సంకేతాలను అందుతున్నాయి ’’ అని ఆయన అన్నారు.
Sourav Ganguly : రాజకీయాల్లోకి రావడం లేదు.. ఎడ్యుకేషనల్ యాప్ తీసుకొస్తున్నా - సౌరవ్ గంగూలీ
కాగా.. గత నెలలో పోలీసుల కస్టడీలో ఒకరు చనిపోయారని ఆరోపిస్తూ కొంత మంది వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసింది. బటద్రవ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది అనంతరం దానిని తగులబెట్టింది. ఆస్తులను ధ్వంసం చేసింది. పలువురు పోలీసులను గాయపర్చారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చర్చనీయాశం అయ్యింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అస్సాం పోలీసులు ఈ దాడిలో ఇస్లామిక్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉందనే విషయాన్ని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు, అన్సారుల్ బంగ్లా బృందం రాష్ట్రంలోని అనేక మసీదులు, మదర్సాలలోకి ప్రవేశించిందని డీజేపీ తెలిపారు.
బిన్ లాడెన్ ఫొటోను ఆఫీసులో పెట్టిన గవర్నమెంట్ అధికారి.. వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ అంటూ రాసి మరీ..
‘‘ రాష్ట్రంలోని సాధారణ ముస్లింలు వారికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అలాంటి విషయం మా దృష్టికి రాలేదు. కానీ ABT కొంతమందిని సమీకరించి పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి, స్లీపర్ సెల్స్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీని వల్ల విదేశాల నుండి ముజాహిద్‌లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించి భద్రతా బలగాలపై దాడి జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయేలా చేస్తున్నారు.’’ అని అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గత వారం తెలిపారు.
