Sourav Ganguly : రాజకీయాల్లోకి రావడం లేదు.. ఎడ్యుకేషనల్ యాప్ తీసుకొస్తున్నా - సౌరవ్ గంగూలీ
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ సంచలనం అయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అంతా ఈ ట్వీట్ విషయమే చర్చించుకున్నారు. అందరూ దాదా ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
Sourav Ganguly : రాజకీయాల్లోకి రావడం లేదు.. ఎడ్యుకేషనల్ యాప్ తీసుకొస్తున్నా - సౌరవ్ గంగూలీ
తాను రాజకీయాల్లోకి రావడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే సొంతంగా ఒక ఎడ్యుకేషనల్ యాప్ తీసుకురావాలని అనుకుంటున్నాని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ మీడియా సంస్థతో తెలియజేశారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచి దేశ వ్యాప్తంగా జరిగిన చర్చకు తెరపడినట్టు అయ్యింది.
ధోని నన్ను జట్టు నుంచి తప్పించాడు.. అప్పుడే ఫిక్స్ అయ్యా.. కానీ.. : సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ ఒక్క సారిగా వార్తలో నిలిచారు. బుధవారం సాయంత్రం సమయంలో ఆయన చేసిన ట్వీటే దీనికి కారణం. ఆ ట్వీట్ లో తాను కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు పేర్కొన్నాడు. ‘‘ నేను క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టి ఈ సంవత్సరంతో 30 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటినుంచి నాకు క్రికెట్ అన్నీ ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యం నాకు మీ అభిమానాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన, నేనిక్కడకు చేరుకోవడానికి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇక ఇప్పుడు నేను కొత్తగా ఒకటి ప్రయత్నిద్దామనుకుంటున్నాను. అది ప్రజలకు మరింత సేవ చేసేది.. మీ మద్దతు అక్కడ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఒక్క సారిగా అనేక ఊహాగానాలకు దారి తీసింది. దాదా రాజకీయాల్లోకి రాబోతున్నారని చర్చ జరిగింది. అంతే కాదు తన BCCI ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తపై బీసీసీఐ స్పందించింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐకి రాజీనామా చేయలేదని ఆ సంస్థ కార్యదర్శి జై షా ప్రకటించారు.
ఇలా గంటల పాటు చర్చలు జరిగాయి. వీటికి తెరదించేందుకు దాదానే ముందుకు వచ్చారు. తాను రాజకీయాల్లో రావడం లేదని, ఆ ట్వీట్ ఉద్దేశం అది కాదని చెప్పారు. తన కొత్త వెంచర్ ఎడ్యుకేషనల్ యాప్ అని తెలిపారు. ఈ కొత్త వెంచర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ)తో తన ప్రస్తుత ఇన్నింగ్స్‌ను ప్రభావితం చేయబోదని క్లారిటీ ఇచ్చారు. ’’ బుధవారం సాయంత్రం చేసిన ఆ మెసేజ్ (ట్వీట్) ఒక సాధారణ అడ్వర్టైజ్‌మెంట్ స్టంట్. నేను బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదు. నేను కమర్షియల్ ఎడ్యుకేషనల్ యాప్‌ను ప్రారంభించబోతున్నాను. అది నా స్వంత వెంచర్. ’’ అని గంగూలీ మీడియాతో తెలిపారు.
MS Dhoni: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ధోని పై బీహార్ లో చెక్ బౌన్స్ కేసు
ఇదిలా ఉండగా.. 2019 సంవత్సరం నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీకొనసాగుతున్నాడు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ లో ముగియనున్నది. అంటే ఆయన ఆ బాధ్యతల్లో మరో మూడు నెలల పాటే కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో దాదా చేసిన ట్వీట్ ప్రధాన్యత సంతరించుకున్నది. ఎందుకంటే ఆయన మళ్లీ బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారనే సూచనలు కనిపించడం లేదు. దీనికి తోడు గత నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రిని గంగూలీ కలిశారు. అయితే ఇది రాజకీయ భేటి కాదని బయటకు చెప్పుకున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం గంగూలీని బరిలోకి దింపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పట్నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికైతే అలాంటిదేమీ లేదని స్పష్టం అయ్యింది. మరి దాదా రాబోయే కాలంలో ఆ దిశగా అడుగులు వేస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.