అతడో గవర్నమెంట్  సబ్ డివిజనల్ ఆఫీసర్. అందరూ ఆఫీసులో మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఫొటోలు ఉంచుకుంటే ఆయన మాత్రం ఒసామా బిన్ లాడెన్ ఫొటోను ఉంచాడు. దాని కింద వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. 

హతమైన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను ‘‘ ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్’’ గా అభివర్ణిస్తూ తన ఆఫీసులో ఉంచుకున్నాడు ఓ గ‌వ‌ర్న‌మెంట్ జూనియ‌ర్ ఇంజ‌నీర్. ఈ విష‌యంలో వెలుగులోకి రావ‌డంతో అధికారులు అత‌డిని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది. 

కాశ్మీర్ లో పౌరుడిపై కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌వాదులు...

దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్) లో రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ గా (ఎస్డీవో) ప‌ని చేస్తున్నారు. అయితే ఆయ‌న త‌న కార్యాల‌యంలో లాడెన్ ఫోటోను ఉంచుకున్నారు. ఆ ఫొటోపై ‘‘ గౌరవనీయుడైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోని అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ ’’అని రాసివున్న ఒక చిన్న నోట్ కూడా దాని కింద పెట్టాడు. అయితే ఈ ర్యాల‌యంలో లాడెన్ ఫొటో, దాని కింద రాసి ఉన్న నోట్ కు సంబంధించిన వార్తలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

బిహార్‌లో కుల గణన చేపడతాం: సీఎం నితీష్ కుమార్.. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం

ఈ వైర‌ల్ న్యూస్ సీనియర్ జిల్లా అధికారులు ద‌గ్గ‌రికి చేరింది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచారణకు ఆదేశించారు. త‌రువాత ఆ స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్ ను సస్పెండ్ చేశారు. లాడెన్ ఫోటోను కూడా కార్యాలయం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే విచారణ నిర్వ‌హించామ‌ని, అనంత‌రం ప్ర‌కాశ్ గౌత‌మ్ ను స‌స్పెండ్ చేశార‌ని ఫరూఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. 

Scroll to load tweet…

ఇది ఇలా ఉండ‌గా.. స‌స్పెన్ష‌న్ కు గురైన అధికారి తన చర్యలను సమర్థించుకున్నారు. ‘‘ ఎవ‌రు ఎవ‌రినైనా రోల్ మోడ‌ల్ గా ఉంచుకోవ‌చ్చు. ఎవరి ఫొటోనైనా ఫ్రేమ్ చేసుకోవ‌చ్చు. ఒసామా ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్. ఆఫీసులో ఉన్న చిత్రాన్ని తొలగించారు. కానీ నా వద్ద అనేక కాపీలు ఉన్నాయి ’’ అని ప్రకాశ్ గౌతమ్ చెప్పారు.