Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: రేప్ విక్టిమ్ తల్లికి కాంగ్రెస్ టికెట్, 125 మందితో జాబితా

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 125 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. యువత, మహిళలకు ఆ పార్టీ టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితాను ప్రియాంక గాంధీ ఇవాళ విడుదల చేసింది.

Congress Names Mother of 2017 Unnao Rape Victim As Poll Candidate
Author
Lucknow, First Published Jan 13, 2022, 1:29 PM IST

న్యూఢిల్లీ:  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 125 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను Congress  పార్టీ ప్రధాన కార్యదర్శి priyanka gandhi విడుదల చేసింది.2017 లో unnao rape victim బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.  ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాసింగ్ కి కాంగ్రెస్ టికెట్  కట్టబెట్టింది.

 

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 125 మంది అభ్యర్ధుల్లో 40 శాతం మంది మహిళలు, 40 శాతం యువకులున్నారని ప్రియాంక గాంధీ చెప్పారు. కొత్త తరహా రాజకీయాలను తెచ్చేందుకు గాను యువతకు ఎక్కువగా టికెట్లు ఇచ్చామని ప్రియాంక గాంధీ తెలిపారు.  ఆశా వర్కర్ల గౌరవ వేతనం కోసం పోరాటం చేసిన asha  వర్కర్ పూనమ్ పాండేకి షాజహాన్ పూర్ టికెట్ ను కాంగ్రెస్ కేటాయించింది.

ఉన్నావ్ రేప్ బాధితురాలు యూపీ సీఎం yogi adityanath నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసకోవడంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపణలు తెరపైకి వచ్చిన వెంటనే బాధితురాలి తండ్రి ని ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కస్టడీలోనే మరణించాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతను మరణించాడని  బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి కుల్దీప్ సెంగార్ కు పదేళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమానాను విధించింది కోర్టు.

నోయిడా నుండి పంఖూరి పాఠక్, లక్నో సెంట్రల్ నుండి సదాఫ్ జాఫర్, సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్ ఫరూఖాబాబాద్ నుండి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే  ఆరాధన మిశ్రాకు  రాంపూర్ ఖాన్  నుండి టికెట్ ఇచ్చారు. సోన్ భద్ర మారణకాండ బాధితుల కోసం గళం విప్పిన నేతకు ఉంభా నుండి టికెట్ దక్కింది. ఎన్ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సదాఫ్ జాపర్ కి లక్నో సెంట్రల్ నుండి టికెట్ దక్కింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios