మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని ఫిర్యాదు.. ప్రిన్సిపాల్, సూడెంట్లకు మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
తమకు మెనూ ప్రకారం ఆహారం తయారు చేయడం లేదని ఐటీఐ స్టూడెంట్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ స్టూడెంట్ పై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతీ రోజూ బంగాళాదుంప కూర వడ్డిస్తున్నారని, దానిని మార్చాలని ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ప్రిన్సిపాల్, స్టూడెంట్లకు మధ్య గొడవ జరిగింది. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జదేరువా ప్రాంతంలోని 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఐటీఐ కాలేజీ హాస్టల్ లో చోటు చేసుకుంది.
లోక్ సభపై సీఎం కేసీఆర్ నజర్.. మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి ఎంపీగా పోటీ ?
వివరాలు ఇలా ఉన్నాయి. జదేరువా సమీపంలోని మొరేనా హాస్టల్లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) కాలేజీ ఉంది. దానికి అనుబంధంగా హాస్టల్ ఉండటంతో పలువురు స్టూడెంట్లు అందులో ఉంటూ కాలేజీకి వస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ మెను ప్రకారం ఆహారం వండటం లేదని స్టూడెంట్లు ఆరోపించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయాలని భావించారు.
అందులో భాగంగా గురువారం మోహక్ అనే విద్యార్థి తన సహచరులతో కలిసి ఐటీఐ హాస్టల్ ప్రిన్సిపాల్ జీఎస్ సోలంకికి వద్దకు వెళ్లారు. తమకు కేవలం బంగాళదుంప కూర మాత్రమే వడ్డిస్తున్నారని, నిబంధనల్లో ఉన్నట్టు మెనూ ప్రకారం ఆహారం తయారు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించకోలేదని ఆయనపై మండిపడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ కు, మోహక్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో మోహక్ చేతిని గట్టిగా లాగడంతో పాటు భౌతిక దాడికి పాల్పడ్డాడని ‘ఇండియా టుడే’ నివేదించింది. అయితే ఘటనా స్థలంలో ఉన్న ఇతర విద్యార్థులు ఘర్షణను ఆపడానికి ప్రయత్నించారు. ఈ గొడవ జరిగేటప్పుడు పలువురు విద్యార్థులు దీనిని వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది.
జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
అనంతరం ఈ ఘటపై విద్యార్థులు మొరెనా కలెక్టర్ అంకిత్ ఆస్థానాకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన తహసీల్దార్ కుల్దీప్ దూబేకు బాధ్యత అప్పగించారు. దీంతో ఆయన హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. అలాగే పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. అయితే ఈ ఘర్షణపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మొరేనా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నరోత్తమ్ ప్రసాద్ భార్గవ మీడియాతో తెలిపారు. దర్యాప్తు బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.