జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
జిమ్ కు వెళ్లి ట్రెడ్ మిల్ పై పరిగెత్తుతున్న ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరిగెత్తుతూ విద్యుదాఘాతానికి గురై 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ కు చెందిన సాక్షన్ కృతి ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆయన ప్రతీ రోజూ రోహిణి సెక్టార్ 19లో జిమ్ ఫ్లెక్స్ ఫిట్ నెస్ అనే జిమ్ కు వెళ్లేవాడు. అక్కడ వర్కౌట్స్ చేసి వచ్చేవాడు.
ఘోర ప్రమాదం.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు .. 16 మంది మృతి..
ఎప్పటిలాగే బుధవారం కూడా జిమ్ కు వెళ్లి ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ట్రెడ్ మిల్ కు ఒక్క సారిగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో దానిపై పరిగెత్తుతున్న సాక్షన్ కృతి కు కూడా షాక్ కొట్టింది. దీంతో క్షణాల్లో ఆయన కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం అతడిని సమీపంలో ఉన్న బీఎస్ఏ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే సాక్షన్ కృతి మరణించాడు.
నగ్నంగా మహిళల ఊరేగింపు..నలుగురు అరెస్ట్.. సీఎం కీలక ప్రకటన
దీనిపై సమాచారం అందటంతో పోలీసులు హాస్పిటల్ కు చేరుకున్నారు. డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే మరణానికి కారణమని నిర్ధారణ అయ్యింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేఎన్కే మార్గ్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 287/304ఏ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.