Asianet News TeluguAsianet News Telugu

మానవత్వం చూపించిన సీఎం సిద్ధరామయ్య.. హత్యకు గురైన బీజేపీ నేత భార్యకు మళ్లీ ఉద్యోగమిస్తామని ప్రకటన

గతేడాది కర్ణాటకలో హత్యకు గురైన బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు భార్య నూతన్ కుమారికి తిరిగి ఉద్యోగమిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 

CM Siddaramaiah, who showed humanity, announced that the wife of the murdered BJP leader will be reinstated..ISR
Author
First Published May 29, 2023, 10:36 AM IST

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొంత మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించింది. ఇందులో గతేడాది హత్యకు గురైన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) నేత ప్రవీణ్ నెట్టారు భార్య కూడా ఉన్నారు. అయితే ఆమెను విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేత భార్య నూతన్ కుమారి ను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఆయన ప్రటించారు. 

సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

‘‘కొత్త ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం నియమించిన తాత్కాలిక ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగించడం సహజ ప్రక్రియ. ప్రవీణ్ నెట్టారు భార్య మాత్రమే కాకుండా ఇప్పటికే 150 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం లేదు’’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నాయి. అయితే ప్రవీణ్ నెట్టారు భార్య నూతన్ కుమార్ ఉద్యోగ విషయాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ మానవత్వం ఆధారంగా ఆమెను తిరిగి నియమిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.

గత ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించిన అన్ని నియామకాలను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో నూతన్ ఉద్యోగాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఖండించింది. ‘‘కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐపై హతమార్చిన ప్రవీణ్ నేతరు భార్యను విధుల నుంచి తొలగించింది. పీఎఫ్ఐ గూండాల చేతిలో హతమైన ప్రవీణ్ నెట్టారు భార్యకు మంగళూరు డీసీలో మా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఇది ఇది గర్హనీయం’’ అని  బీజేపీ ట్వీట్ చేసింది. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో పలు వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. 

దారుణం.. ఇస్లాంలోకి మారాలని గర్భవతి అయిన సహజీవన భాగస్వామిపై ఒత్తిడి.. విషప్రయోగం చేయడంతో మృతి..

అయితే దీనిపై కాంగ్రెస్ స్పందించింది. సీఎం ఆఫీసులో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పదవీకాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆమెను తీసుకున్నారని, కావున సహజమైన మార్గంలోనే ఉద్యోగం తొలగించిన వారిలో నూతన్ కుమార్ కూడా ఉన్నారని ఆ పార్టీ తన చర్యను స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. నూతన్ కుమారి ఉద్యోగం కోసం బొమ్మై ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 29న ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో నూతన్ కుమారిను సీఎం ఆఫీసులో ‘గ్రూప్ సి’ పోస్టుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినట్లు పేర్కొంది. బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా కొనసాగే వరకు లేదా ఆమె ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా కొత్త ఉత్తర్వులు జారీ అయ్యే వరకు నూతన్ కుమారి సర్వీసులో ఉంటారని నోటిఫికేషన్ లో ఉంది.

ఉజ్జయినిలో పిడుగుపాటు.. మహాకాల్ లోక్ కారిడార్ లో ఆరు విగ్రహాలు ధ్వంసం.. దేవుడు కూడా విసిగిపోయాడన్న ఆర్జేడీ..

కాగా.. గత ఏడాది జూలై 26న దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకా బెల్లారే గ్రామంలో జరిగిన ప్రవీణ్ నెట్టారు హత్య రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 20న ఎన్ఐఏ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో శత్రువులను, లక్ష్యాలను హతమార్చేందుకు పీఎఫ్ఐ రహస్య 'హిట్ స్క్వాడ్స్', 'సర్వీస్ టీమ్స్' లేదా 'కిల్లర్ స్క్వాడ్'లను ఏర్పాటు చేసిందని ఎన్ఐఏ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios