Asianet News TeluguAsianet News Telugu

ఉజ్జయినిలో పిడుగుపాటు.. మహాకాల్ లోక్ కారిడార్ లో ఆరు విగ్రహాలు ధ్వంసం.. దేవుడు కూడా విసిగిపోయాడన్న ఆర్జేడీ..

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ లో ఆరు విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. అలాగే పిడుగుపాటు వల్ల ముగ్గురు చనిపోయారు. 

Thunderstorm in Ujjain.. Six idols destroyed in Mahakal Lok Corridor.. Even God is tired RJD..ISR
Author
First Published May 29, 2023, 7:46 AM IST

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సహా పలు నగరాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అయితే మహాకాల్ లోక్ ఆలయ కారిడార్ లో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఉజ్జయిని నగరంలో చెట్టు కూలి ఒకరు, నాగాడలో కచ్చా ఇంటి గోడ కూలి మరొకరు  మరణించారు. ఇదే జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈదురుగాలుల వల్ల సుమారు 50 చెట్లు, పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

నిజామాబాద్ లో ఘోరం.. కన్న తల్లిని రోకలి బండతో కొట్టి హతమార్చిన కూతురు

ఆదివారం సెలవు దినం కావడంతో మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ ను వేల సంఖ్యలో భక్తులు సందర్శించారు. అయితే ఈ గాలి వాన బీభత్సం సృష్టించేటప్పుడు ఈ ప్రాంగణంలో సుమారు 25 వేల మంది భక్తులు ఉన్నారు. ఈ ఈదురుగాలుల వల్ల మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ లో ఏడు సప్తర్షి విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి గాయాలుకాకపోవడంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మహాకాల్ లోక్ టెంపుల్ కారిడార్ ను 2022 అక్టోబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహాకాల్ లోక్ లో 155 విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గాలివానకు దెబ్బతిన్న విగ్రహాలకు కాంట్రాక్టర్ మరమ్మతులు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ఆరు విగ్రహాల్లో రెండింటిని పీఠాల నుంచి పూర్తిగా తొలగించారు. ఈ విగ్రహాలు అయిదేళ్ల కాలపరిమితి ఉందని, వాటిని రూపొందించిన సంస్థ మళ్లీ విగ్రహాలను తయారు చేసి వీలైనంత త్వరగా భర్తీ చేస్తుందని కలెక్టర్ కుమార్ పురుషోత్తం తెలిపారు.

శిథిలావస్థకు చేరిన, దెబ్బతిన్న విగ్రహాలను క్రేన్ సాయంతో తరలించామని కలెక్టర్ చెప్పారు. అదే ఎఫ్ఆర్పీ (ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్) మెటీరియల్ తో తయారు చేసిన ఇతర విగ్రహాల ఆడిట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఆరు విగ్రహాల తరలింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

దేవుడు కూడా విసిగిపోయాడు - ఆర్జేడీ..
ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆర్జేడీ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. దేవుడు, మతం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న దొంగలు, కుట్రదారుల తీరుతో దేవుడు కూడా విసిగిపోయాడని మండిపడింది. ‘‘ఉపర్ వాలే కే ఘర్ దేర్ హై అంధేర్ నహీ’’అని పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హిందీలో పోస్ట్ చేసింది. ‘‘దేవుడి ఇంట్లో న్యాయం ఆలస్యం అవుతుంది. కానీ నిరాకరించబడదు’’ అని దాని అర్థం.

Follow Us:
Download App:
  • android
  • ios