Asianet News TeluguAsianet News Telugu

సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

జంతర్ మంతర్ వద్ద రెజర్లపై పోలీసుల దురుసు ప్రవర్తనను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. పార్లమెంట్ ప్రారంభించిన రోజే వారిపై ఇలాంటి చర్య జరగడం వల్ల సెంగోల్ వంగిపోయినట్టు అయ్యిందని ఆయన విమర్శించారు. 

Sengol bowed on the first day - MK Stalin. Tamil Nadu CM condemned police behavior against wrestlers..ISR
Author
First Published May 29, 2023, 9:56 AM IST

కొత్త పార్లమెంటు భవనంలో ‘‘సెంగోల్’’ ప్రతిష్ఠిస్తున్నట్టు ప్రకటించిన నాటి నుంచి అది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దానిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చలే జరిగాయి. సెంగోల్ ను ప్రతిష్ఠించడంపై రాజకీయంగా చాలా విమర్శలు వచ్చాయి. అనేక మంది దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది రాజరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ సెంగోల్ ప్రతిష్టించడాన్ని విమర్శించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా దీనిపై మాట్లాడారు.

దారుణం.. ఇస్లాంలోకి మారాలని గర్భవతి అయిన సహజీవన భాగస్వామిపై ఒత్తిడి.. విషప్రయోగం చేయడంతో మృతి..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ 'సెంగోల్ ట్విస్ట్' ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలీసుల చర్యను తమిళనాడు సీఎం విమర్శిస్తూ.. ‘‘సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది’’ అని అన్నారు. న్యాయాన్ని నిలబెట్టడానికి చిహ్నంగా భావించే సెంగోల్ ను ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనానికి పరిచయం చేసిన సందర్భంగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రెజర్లను బలవంతంగా తోసుకుంటూ అదుపులోకి తీసుకున్నారు. క్రీడాకారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తమిళనాడు సీఎం స్పందించారు. ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండించారు. రెజ్లర్ల కోసం బీజేపీ ఏమీ చేయలేదని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంకే స్టాలిన్ ఓ ట్వీట్ లో విమర్శించారు. 

‘‘పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి నిర్బంధించడం గర్హనీయం. దీనిని బట్టి సెంగోల్ మొదటి రోజే వంగిపోయాడని అర్థమవుతోంది. రాష్ట్రపతిని పక్కదారి పట్టించి, ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున కూడా ఇలాంటి దారుణం జరగడం సమంజసమేనా’’ అని స్టాలిన్ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios