హింసకు పాల్పడితే దేవాలయాలనైనా మూసివేయండి - మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
కొందరు దేవాలయాల ఉత్సవాలను నిర్వహించడం వెనక ఉన్న ఉద్దేశాన్ని మార్చివేశారని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. హింసను కొనసాగిస్తే దేవాలయాలైనా మూసివేయడం మంచిదని పేర్కొంది.

హింసను కొనసాగిస్తే దేవాలయాలైనా మూసివేయాలని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక దేవాలయం ఉద్దేశ్యం శాంతి, సంతోషం కోసం భక్తులు భగవంతుడిని ఆరాధించేలా చేయడమే అని, కానీ దురదృష్టవశాత్తు, ఆలయ పండుగలు హింసను పెంచుతున్నాయని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
మంచినీరు అని భావించి యాసిడ్ తాగిన కార్మికురాలు.. తరువాత ఏమైందంటే ?
దేవాలయాల ఉత్సవాలకు తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్.. దేవాలయాలు హింసను కొనసాగిస్తే వాటి ఉనికికి అర్థం ఉండదని, అలాంటి సందర్భాల్లో హింసను నివారించేందుకు ఆలయాలను మూసివేయడం మంచిదని అన్నారు.
యూట్యూబ్ లో ఉన్నట్టు చేసి ప్రాణాలో పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి.. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడంటే ?
కొన్ని దేవాలయాల ఉత్సవాలు ఏదో ఒక వర్గానికి బలప్రదర్శనగా మారాయని తెలిపారు. కొందరు ఈ ఉత్సవాలను నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని దెబ్బతీశారని, వాటిని భక్తితో నిర్వహించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మనిషి తన అహంకారాన్ని వీడి దేవుడి ఆశీస్సులు కోరుతూ ఆలయానికి వెళ్లేంత వరకు, దాని వల్ల ప్రయోజనం ఉండదని జస్టిస్ వెంకటేష్ పేర్కొన్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.
ఈ పిటిషనర్ ను మైలాడుతురైలోని అరుల్మిఘు శ్రీ రుద్ర మహా కాళియమ్మన్ అలయం వంశపారంపర్య ధర్మకర్త కె.తంగరసు దాఖలు చేశారు. దీనిపై అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.దామోదరన్ వాదనలు వినిపిస్తూ.. ఉత్సవం నిర్వహిస్తున్న రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తిందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్ శాంతి సమావేశం ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కాగా.. వివాదాల పరిష్కారంలో పోలీసు, రెవెన్యూ శాఖల సమయం, శక్తి అనవసరంగా వృథా అవుతున్నాయని, పోలీసు రక్షణ కల్పించలేమని కోర్టు అభిప్రాయపడింది.