Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతుండగానే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ చైనా గ్రామం ఉన్నదనే వార్తలు ఈ ఏడాది తొలినాళ్లలో కలకలం రేపాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరిస్తూ పెంటగాన్ ఓ రిపోర్టు వెల్లడించింది. తాజాగా, మరో గ్రామం అదే రాష్ట్రంలో కనిపించింది. 2019లో అక్కడ నివాసాలు, నిర్మాణాలేవీ లేవు. కానీ, తాజాగా, అక్కడ కనీసం 60 నివాసాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
 

china new village in indina territory.. what satellite images showing
Author
New Delhi, First Published Nov 18, 2021, 4:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: India, China మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరుదేశాల సైనిక అధికారుల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది మే నెలలో గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల ప్రకంపనలు ఇంకా ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవలే చైనా గ్రామం ఒకటి మనదేశ భూభాగంలో వెలసిందనే వాదన చాలా మందిలో ఆందోళన తెచ్చింది. తాజాగా, మరో Villageను చైనా నిర్మించినట్టు తెలుస్తున్నది. 2019కి పూర్వం అక్కడ గ్రామమే లేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల్లోనే భారత పరిధిలోనే చైనా గ్రామం ఉన్నట్టు అర్థమవుతున్నది. రెండో గ్రామం కూడా Arunachal Pradeshలోనే వెలుగు చూసింది. ఆ గ్రామంలో 60 బిల్డింగ్‌లు కనిపిస్తున్నాయి. ఓ చోట చైనా పతాకమే రూఫ్‌గా ఉన్నది. ఆ చైనా పతాకం శాటిలైట్ చిత్రాలకూ చిక్కేలా పెద్దగా రూపొందించడం గమనార్హం.

ఈ ఏడాది జనవరిలో చర్చ జరిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో ‘చైనా గ్రామాని’కి తూర్పు వైపున సుమారు 93 కిలోమీటర్ల దూరంలో తాజా నిర్మాణాలు కనిపించాయి. వాస్తవాధీన రేఖకు ఆరు కిలోమీటర్ల దూరంలో భారత పరిధిలోనే ఈ గ్రామం ఉన్నట్టు తెలుస్తున్నది. భారత్ ఎప్పటి నుంచే ఇదే సరిహద్దు అని చెబుతుండటం గమనార్హం. కొత్త గ్రామం ఏర్పడ్డ ప్రాంతం ఎక్కడ ఉందని భారత ఆర్మీని అడగ్గా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, వాస్తవాధీన రేఖకు ఉత్తరాన ఉన్నదని తెలిపింది. అయితే, భారత పరిధిలో ఈ గ్రామాన్ని నిర్మించలేదనే వాదన మాత్రం చేయకపోవడం కొత్త సందేహాలను తెస్తున్నది. అంతర్జాతీయ శాటిలైట్ ఇమేజరీ సంస్థల సహకారంతో ఓ జాతీయ మీడియా ఈ గ్రామ చిత్రాలను ప్రచురించింది. అరుణాచల్ ప్రదేశ్ షి యోమి జిల్లాకు చెందిన చిత్రాల్లో కొత్త గ్రామం కనిపించింది.

Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

అయితే, భారత ప్రభుత్వం పరిధిలోని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించే భారత్‌మ్యాప్స్‌లో మనదేశ డిజిటల్ మ్యాప్ మాత్రం ఈ గ్రామం భారత పరిధిలోనే ఉన్నట్టు వివరిస్తున్నది. అధికారిక సర్వే ఆప్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా సేకరించిన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా ఈ గ్రామం భారత పరిధిలోనే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఆ చైనా గ్రామం భారత పరిధిలోనే ఉన్నట్టు అర్థమవుతున్నదని యూరప్‌లోని ఓ ఫోర్స్ అనాలిసిస్ సంస్థలో చీఫ్ మిలిటరీ అనలిస్ట్‌గా పనిచేస్తున్న సిమ్ ట్యాక్ వెల్లడించారు. అయితే, ఈ గ్రామం ఉన్న ప్రాంతానికి చైనా దేశ ప్రజలు సులువుగా వెళ్లడానికి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని, కానీ, భారత్ వైపు పెద్ద కొండలు ఉండటంతో ఆ గ్రామ వెలసిన ప్రాంతాన్ని సులువుగా చేరేలా లేదని వివరించారు. ఆ ప్రాంతం భారత పరిధిలో ఉన్నప్పటికీ చైనాతో పోలిస్తే భారత్ వైపు నుంచి అంత సులువగా అక్కడికి వెళ్లలేరని తెలిపారు. 

Also Read: అరుణాచల్​ప్రదేశ్​లో చైనా గ్రామం.. క్లారిటీ ఇచ్చిన భద్రత అధికారులు..

భారత్‌లోని శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీపై పట్టున్న నిపుణులూ ఈ కొత్త గ్రామం భారత సరిహద్దు పరిధిలోనే ఉన్నట్టు తెలిపారు. భారత్‌మ్యాప్స్‌ను పరిశీలిస్తే కొత్తగా కనిపిస్తున్న ఈ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు ఏడు కిలోమీటర్లు దూరంలో భారత పరిధిలోనే ఉన్నట్టు తెలుస్తున్నదని అరుప్ దాస్‌గుప్తా వివరించారు. అధికారిక భారత చిత్రాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం (Village) నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ (Pentagon) గత వారం ఓ నివేదికలో పేర్కొనడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చైనా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసుకుంటున్నట్టుగా ఆ నివేదికలో పేర్కొంది. ‘1959లో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌ను అధిగమించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించింది. ఆ ఘ‌ట‌న‌ను లాంగ్జూగా పేర్కొంటారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం వారి ఆధీనంలోనే ఉంది. ఆ ప్రాంతంలోనే వారు గ్రామాన్ని నిర్మించారు’ అని భద్రతా వర్గాలు తెలిపాయి. ఎగువ సుబంసిరి జిల్లాలోని వివాదాస్పద సరిహద్దు వెంట ఉన్న గ్రామం చైనా నియంత్రణలో ఉందని పేర్కొన్నాయి. ఆ ప్రాంతంలో చైనా చాలా ఏళ్లుగా ఆర్మీ పోస్ట్‌ను నిర్వహిస్తుందని.. చైనీయులు చేపట్టిన వివిధ నిర్మాణాలకు తక్కువ సమయంలో పూర్తైనవి కావని వెల్లడించాయి. తాజాగా, మరో చైనా గ్రామం ఉన్నదని వార్తా కథనాలు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios