Asianet News TeluguAsianet News Telugu

ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలను వ్యతిరేకించిన చైనా.. ఇది సరిహద్దు ఒప్పందాల స్ఫూర్తికి ఉల్లంఘన అని ఆరోపణ

ఇండియా - అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విన్యాసాలను తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. ఇది భారత్ - చైనాకు మధ్య జరిగిన ఒప్పందాల ఉల్లంఘనే అవుతుందని తెలిపింది. 

China has opposed the Indo-US military exercises, alleging that it is a violation of the spirit of border agreements
Author
First Published Dec 1, 2022, 1:48 PM IST

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) సమీపంలో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జరగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా బుధవారం తెలిపింది. ఇది ఇండియా, చైనాకు మధ్య ఉన్న రెండు దేశాల సరిహద్దు ఒప్పందాల స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మీడియాతో మాట్లాడారు. ‘‘1993-1996లో చైనా, భారతదేశాల మధ్య ఒప్పందం జరిగింది. అయితే చైనా-భారత్ సరిహద్దు వద్ద ఎల్ఏసీ సమీపంలో ఇండియా - యూఎస్ చేపడుతున్న సంయుక్త సైనిక వ్యాయామం ఆ ఒప్పందపు స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది’’ అని తెలిపారు.

గుజరాత్ లో మొదటి దశ ఎలక్షన్స్.. సైకిల్ మీద గ్యాస్ సిలిండర్ తో పోలింగ్ బూత్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఇది (సైనిక విన్యాసం)  చైనా, భారత్‌ల మధ్య పరస్పర విశ్వాసానికి పనికిరాదని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. కాగా.. ఈ సైనిక విన్యాసాల సమయంలో 1993, 1996 ఒప్పందాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తూర్పు లద్దాఖ్ లో ఉన్న ఎల్ఏసీలోని వివాదాస్పద ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో దళాలను తరలించడానికి ప్రయత్నించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) 2020 మేలో ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించాయి. ఆ ఒప్పందాల ప్రకారం.. సరిహద్దు వివాదాన్ని శాంతియుత, స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి.

కాగా.. భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల 18వ ఎడిషన్ ‘యుధ్ అభ్యాస్’ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో వాస్తవ నియంత్రణ రేఖకు 100 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయ చర్యలలో రెండు సైన్యాల మధ్య పరస్పర చర్య, నైపుణ్యాన్ని పంచుకోవడం దీని లక్ష్యంగా ఉంది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ కసరత్తు ఇటీవలే ప్రారంభమైంది. దీనిని ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు.

మంగళూరు కుక్కర్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ.. నేటీ నుంచే విచారణ..

కాగా.. నవంబర్ 19న ఇండియన్ ఆర్మీ ఈ సైనిక విన్యాసాల అంశంపై ట్వీట్ చేసింది. ‘‘ఇండో-యూఎస్ సంయుక్త వ్యాయామం ‘యుధ్ అభ్యాస్’ 18వ ఎడిషన్ ఈ రోజు ‘ఫారిన్ ట్రైనింగ్ నోడ్ ఔలీలో ప్రారంభమైంది.  శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యలలో రెండు సైన్యాల మధ్య పరస్పర చర్య, నైపుణ్యాన్ని పంచుకోవడం ఉమ్మడి వ్యాయామం లక్ష్యం ’’ అని పేర్కొంది.  అయితే ఇందులో 11వ వైమానిక విభాగానికి చెందిన రెండవ బ్రిగేడ్‌కు చెందిన యూఎస్ ఆర్మీ సైనికులు, అస్సాం రెజిమెంట్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటారని రక్షణ మంత్రిత్వ శాఖ నవంబర్ 15న పేర్కొంది.

ఇన్సూరెన్స్ కట్టి భార్యను చంపేసిన భర్త.. రూ. 1.90 కోట్ల కోసం ప్రణాళిక వేసి యాక్సిడెంట్

కాగా. గతేడాది అక్టోబర్ లో అమెరికాలోని అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్‌సన్‌లో ఈ సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించారు. అయితే ఈ  ఉమ్మడి వ్యాయామం మానవతా సహాయం, విపత్తు సహాయ (HADR) కార్యకలాపాలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇదిలా ఉండగా.. గతేడాది నిర్వహించిన భారత్-అమెరికా సైనిక విన్యాసాలపై చైనా సైన్యం ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios