Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో మొదటి దశ ఎలక్షన్స్.. సైకిల్ మీద గ్యాస్ సిలిండర్ తో పోలింగ్ బూత్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే..

గుజరాత్ ఎన్నికల వేళ ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సైకిల్ మీద గ్యాస్ సిలిండర్ తో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. 

congress mla cycle ride with carrying gas cylinder to polling booth in gujarat
Author
First Published Dec 1, 2022, 1:25 PM IST

అమ్రేలి : గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని విచిత్రమైన రీతిలో సైకిల్‌పై 'గ్యాస్ సిలిండర్'తో సహా పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటు వేశారు. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రజలకు నొక్కి చెప్పే ఉద్దేశ్యంతోనే అమ్రేలికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సైకిల్‌పై సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని మాట్లాడుతూ.. బిజెపి గుజరాత్‌ను స్వార్థం, భయంల మధ్య బానిసగా మార్చేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ వైఫల్యం కారణంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం క్రమంగా పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ ధర రూ.1100 కంటే ఎక్కువ, విద్యుత్ ఖరీదై పోయింది, రవాణా ధరలు విపరీతంగా పెరిగాయి, విద్య ప్రైవేటీకరించబడుతోంది. ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. 3.5 లక్షల మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఈ వైఫల్యం కారణంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారని నమ్ముతున్నాను”అని పరేష్ ధనాని అన్నారు.

ద్రవ్యోల్బణాన్ని ఓడించేందుకే తాను ఓటు వేశానని ఆయన అన్నారు. "నా ఓటు కొత్త ప్రభుత్వంతో యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది, అధికార మార్పిడి జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది" అని ఆయన అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.

మంగళూరు కుక్కర్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ ఎంట్రీ.. నేటీ నుంచే విచారణ..

గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, తొలి దశ ఎన్నికల బరిలో నిలిచిన 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం ఓటర్లలో 1,24,33,362 మంది పురుషులు, 1,1,5,42,811 మంది మహిళలు,  497 మంది థార్డ్ జెండర్ కు చెందినవారున్నారు. 4 లక్షల మంది పీడబ్ల్యూడీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

దాదాపు 9.8 లక్షల మంది సీనియర్ సిటిజన్ ఓటర్లు (80), 100 కంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 10,000 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారు. 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల 5,74,560 మంది ఓటర్లు ఉండగా, 4,945 మంది ఓటర్లు 99 ఏళ్లు పైబడిన వారు ఉన్నారని ఈసీ తేల్చింది. 163 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా అందులో 125 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు.

14,382 ఓటింగ్ కేంద్రాలు ఉండగా, వీటిలో పట్టణ ప్రాంతాల్లో 3,311, గ్రామీణ ప్రాంతాల్లో 11,071 ఉన్నాయి. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశ ఓటింగ్ సందర్భంగా 19 జిల్లాల్లోని 13,065 పోలింగ్ బూత్‌లలో లైవ్ వెబ్‌కాస్టింగ్ జరుగుతోంది. గాంధీనగర్‌లో ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ రూం కూడా పనిచేస్తోంది. ఉదయం 6.30 గంటల నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర పరిశీలన చేస్తారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి దశలో మొత్తం 25,430 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఈ 13,065 పోలింగ్ స్టేషన్‌లలో వెబ్‌కాస్ట్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ ఎన్నికల్లో నిలబడ్డ ముఖ్య అభ్యర్థులలో, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుంచి, ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి ఖంభాలియా నుంచి, కాంగ్రెస్ మాజీ నాయకుడు, బిజెపి అభ్యర్థి హార్దిక్ పటేల్ విరామ్‌గామ్ నుంచి, మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు బిజెపి అభ్యర్థి అల్పేష్ ఠాకోర్ గాంధీనగర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కతర్గాం నియోజకవర్గం నుంచి, గుజరాత్ హోం మంత్రి (రాష్ట్రం) హర్ష సంఘవి మజురా నుంచి, రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నుంచి, గుజరాత్ మాజీ మంత్రి పర్షోత్తమ్ సోలంకి భావ్‌నగర్ రూరల్ నుంచి, కున్వర్జీ బవలియా జస్దాన్ నుంచి, కాంతిలాల్ అమృతియా మోర్బి నుంచి, జయేశ్ రదాదియా  జెట్పూర్. వాఘోడియా నుంచి పోటీ చేస్తున్నారు.

డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు.. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios