Asianet News TeluguAsianet News Telugu

దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా.. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా.. 27 మంది దుర్మ‌ర‌ణం.. 

యూపీలోని  కాన్పూర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది.  ట్రాక్టర్‌ బోల్తా పడిన దుర్ఘటనలో 27 మంది మృతిచెందారు. మృతుల్లో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్న‌ట్టు.. మ‌రో 25 మందికి పైగా గాయాలైన‌ట్టు తెలుస్తుంది.

Children among 27 dead as tractor overturns in UP's Kanpur
Author
First Published Oct 2, 2022, 3:56 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. సామర్థ్యానికి మించి ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీలో బోల్తా ప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 27 మంది మరణించారు. మృతుల్లో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్న‌ట్టు.. మ‌రో 25 మందికి పైగా గాయాలైన‌ట్టు తెలుస్తుంది. ఉన్నావో జిల్లాలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

వివరాల్లోకెళ్తే... కాన్పూర్‌లోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్తా గ్రామానికి చెందిన భక్తులు ట్రాక్టర్-ట్రాలీలో ఫతేపూర్‌లోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లారు. ప్రమాద స‌మ‌యంలో  దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆల‌యం నుంచి తిరిగి వస్తుండగా.. సాధ్, గంభీర్‌పూర్ గ్రామం మధ్య రోడ్డు పక్కన ఉన్న చెరువులో ట్రాలీ బోల్తా పడడంతో 27 మంది మరణించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 

అవుటర్ ఎస్పీ తేజ్ స్వరూప్ సింగ్ సహా పలు పోలీస్ స్టేషన్ల పోలీసు బలగాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. క్షతగాత్రులను పీహెచ్‌సీ, కాన్పూర్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 11 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. 

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు,, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున నష్ట‌ప‌రిహారం ప్రకటించారు.

ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీనియర్ మంత్రులు రాకేష్ సచన్, అజిత్ పాల్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంతో వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తేలింది. ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిన చోట నీరు నిండిపోయింది. దీంతో ట్రాలీలో ఉన్న చాలా మంది చనిపోయారు. 

ట్రాక్టర్ ట్రాలీపై ప్రయాణించవద్దు: సీఎం యోగి విజ్ఞప్తి

కాన్పూర్ ప్రమాదం తర్వాత..  ట్రాక్టర్ ట్రాలీని వ్యవసాయ పనులకు, సరుకుల రవాణాకు మాత్ర‌మే  వినియోగించాలని సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. ప్ర‌యాణానికి టాక్టర్ ట్రాలీని ఉపయోగించకూడదనీ,  కాన్పూర్‌లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


మృతుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది

1- మిథ్లేష్  
2- కేశకలి W/O దేశరాజ్
3- కిరణ్ S/O శివనారాయణ
4- - పారుల్ S/O రాంధర్
5- అంజలి W/O రామ్‌జీవన్
6 - రాంజాంకి  S/O చిద్దు
7 - లీలావతి W/O  రామ్దులారే
8 - గుడియా W/O  సంజయ్
9 - తారా దేవి W/O టిల్లు
10 - అనితా దేవి W/O బీరేంద్ర సింగ్
11 - సాన్వి S/O కల్లు
12- శివం S/Oకల్లు
13 - నేహా S/Oసుందర్‌లాల్
14 - మనిసా S/O రామదులారే
15- ఉసా W/O బ్రజ్‌లాల్
16- గీతా సింగ్ W/O శంకర్ సింగ్
17 - రోహిత్ S/O రాల్దులారే
18- రవి S/O శివరామ్
19 - జయదేవి W/O శివరామ్
20 - మాయావతి W/O రాంబాబు
22 సునీత S/O ప్రహ్లాద్
23 - శివాని S/O స్వీయ రాంఖిలావన్
24 - ఫూల్మతి W/O స్వ సియారం
25 - రాణి W/O రాంశంకర్

Follow Us:
Download App:
  • android
  • ios