ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. Chandigarh మున్సిపోల్స్ లో ఆప్ హావా..

చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ( Chandigarh Municipal Corporation election) ఆప్ సత్తా చాటింది. 35 స్థానాలు ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో ఆప్ 14 వార్డుల్లో విజయం సాధించి.. టాప్ లో నిలిచింది. ఇక బీజేపీ 12 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో, శిరోమణి అకాళీధళ్ కేవలం ఒకే స్థానంలో విజయం సాధించి.. విజయం సాధించి సత్తా చాటాయి.
 

Chandigarh a trailer, Punjab's the movie: AAP's Raghav Chadha on debut feat

చండీగఢ్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ( Chandigarh Municipal Corporation election)  ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. మొత్తం 35 మున్సిపల్‌ వార్డులకు ఎన్నిక‌లు జ‌ర‌గగా..  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) 14 వార్డుల్లో గెలిచి.. ముందంజ‌లో ఉంది. ఆ త‌రువాత బీజేపీ 12 వార్డుల్లో, కాంగ్రెస్ 8 వార్డుల్లో, శిరోమణి అకాలీదళ్ ఒక వార్డుల్లో విజ‌యం  సాధించాయి. పంజాబ్‌, హర్యానా రాజధాని అయిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు శుక్రవారం ఎన్నికలు జరుగగా, సోమవారం కౌంటింగ్‌ నిర్వహించారు.

ఈ ఎన్నిక ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే.. ఆప్, బీజేపీ మధ్య పోరు  హోరా హోరీగా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇరు  పార్టీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డాయి. అయితే 35 స్థానాలు ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్లో ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అధికారం ఏర్పాటు చేయాలంటే 18 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి. అయితే ప్రస్తుతం ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాట‌క‌పోవ‌డంతో హంగ్ ఏర్పాడింది. కానీ, ఆప్ 14 సీట్లను కైవ‌సం చేసుకోని  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

Read Also : ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.. యూపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?.. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

కాగా, వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఆప్‌, చండీగఢ్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించడంపై సంబరాల్లో మునిగిపోయింది.  మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి భారీ ఆధిక్యం అందించినందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ చండీగఢ్ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా కృతజ్ఞతలు తెలిపారు. ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..   చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం ట్రైలర్ మాత్రమేనని, అస‌లు చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలని వ్యాఖ్యానించారు. పోటీ చేసిన తొలిసారే తమ లాంటి చిన్న, నిజాయితీ గల పార్టీకి ఇంత ప్రేమ, నమ్మకాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. 

Read Also : Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!
  
ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలి, సిట్టింగ్ మేయర్,   పార్టీ అభ్యర్థి రవికాంత్ శర్మ ఆప్ అభ్యర్థి దమన్‌ప్రీత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అలాగే.. బీజేపీ మాజీ మేయర్ దవేష్ మౌద్గిల్ ఆప్ అభ్యర్థి జస్బీర్ సింగ్ చేతిలో 939 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మూడు వ్యవసాయ చట్టాలపై హర్యానా, పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా.. బీజేపీ 12 స్థానాల్లో గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం.  ప్రస్తుత ఫ‌లితాలు రాబోయే చండీగఢ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఎలాంటి స‌మీక‌ర‌ణాలు చేస్తాయో వేచి చూడాలి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios