Asianet News TeluguAsianet News Telugu

Five States Election in 2022: ఒమిక్రాన్​ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా? ఈసీ నిర్ణ‌యంపై ఉత్కంఠ

దేశంలో ఒమిక్రాన్ విజృంభ‌న నేప‌థ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌తో సమావేశం నిర్వహించనుంది. ఈ మేర‌కు కేంద్రం ఆరోగ్య శాఖ‌, ఎన్నిక సంఘం భేటీ కానున్న‌ది. ఎన్నిక‌లు నిర్వ‌హించాలా? వ‌ద్దా? అనే దానిపై స్ప‌ష్ట‌త రానున్న‌ది. 
 

Assembly Elections in 5 States Likely to be Postponed
Author
Hyderabad, First Published Dec 27, 2021, 2:52 PM IST

Five States Election in 2022:  దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విజృంభిస్తోంది. వారాల వ్య‌వ‌ధిలోనే దాదాపు 600 కేసులు నమోదు అయ్యాయి. మ‌రోవైపు క‌రోనా కూడా విసృత్తంగా వ్యాప్తి చెందుతోంది. ఈ త‌రుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జ‌రగ‌నున్న అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌తో సమావేశం నిర్వహించనుంది. 

2022లో  ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి, ఎప్రిల్ లో జ‌రగ‌నున్నాయి. దీంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో  పెద్ద ఎత్తున్న ర్యాలీలు, ప్ర‌చారాలు. భారీ ఎత్తున్న‌జ‌న స‌మీక‌ర‌ణ‌లు, స‌భలు, స‌మావేశాలు ఏర్పాటు చేయ‌నున్నాయి ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ . ఈ త‌రుణంలో హై ప్రొఫైల్ నాయ‌కులు ప్ర‌ధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ప్ర‌ధాన ప‌క్ష నాయ‌కులు కూడా ఈ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. 

Read Also: ఎన్నిక‌ల‌కు బ్రేక్‌.. యూపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?.. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

ఈ నేపథ్యంలో  అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్పందిస్తూ  యూపీలోని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ఆయా రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్) మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఇటు కేంద్రానికి, అటు  కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని పేర్కొంది.

Read Also: Vaccine Registration for Children: పిల్లలకు వ్యాక్సిన్.. జనవరి 1 నుంచే రిజిస్ట్రేషన్.. ఆ కార్డు ఉన్న చాలు..
 
ఒమిక్రాన్ విజృంభణ‌ను దృష్టిలో పెట్టుకుని..  ఇప్పటికే చైనా, నెదర్లాండ్స్‌, జర్మనీ వంటి దేశాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించాయ‌ని గుర్తు చేసింది. ఇప్ప‌టికే భార‌త్ లో వంద‌లాది ఒమిక్రాన్‌ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా సెకండ్ వేవ్ సమయంలో లక్షలాది మంది మృతి చెందార‌ని గుర్తుకు చేసింది. ఈ క్ర‌మంలో యూపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నిక‌లు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను హైకోర్టు గుర్తుకు చేసింది. ఈ త‌రుణంలో నిర్వ‌హించే ఎన్నిక‌ల‌ ర్యాలీల్లో క‌రోనా నిబంధనలు పాటించడం అసాధ్యమేనా ప్ర‌శ్నించింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌చారాలు నిర్వ‌హించ‌రాద‌ని, టీవీ, వార్తా పత్రికల ద్వారా ప్రచారం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి సూచించింది.  లేదా రెండు లేదా మూడు నెల‌ల పాటు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని  పేర్కొంది.  

Read Also: యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేటోళ్లు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు - మంత్రి నిరంజన్ రెడ్డి

దేశ వ్యాప్తంగా  కరోనా, ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ పార్టీలు సందిగ్ధంలో ప‌డ్డాయి.  ఈ నేప‌థ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది. దీంతో ఈ స‌మావేశం  అత్యంత‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా.. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే రిపోర్టుల ప్రకారం అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌పై ఈసీ ఓ నిర్ణయానికి రానుంది.  దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ  కేసుల సంఖ్య 600కు చేరువ అయ్యింది. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితులున్నారు.  ఇప్పటివరకు 19రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది ఒమిక్రాన్‌ వేరియంట్‌.

Follow Us:
Download App:
  • android
  • ios