Asianet News TeluguAsianet News Telugu

భద్రత, ట్రాక్ పునరుద్ధరణపై వెనక్కి తగ్గి.. వేగం, హైప్రొఫైల్ ప్రారంభోత్సవాల పైనే కేంద్రం దృష్టి - కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వం రైల్వేల భద్రత, ట్రాక్ ల పునరుద్దత వెనకడుగు వేసి, కేవలం హైప్రొఫైల్ ప్రారంభోత్సవాలు, వేగంపైనే దృష్టి పెడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధాని మోడీపై మూడు ప్రశ్నలు సంధించింది. 

Centers focus on speed, high profile inaugurations, backtracking on safety, track renovation - Congress..ISR
Author
First Published Jun 4, 2023, 2:30 PM IST

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైలు భద్రత, ట్రాక్ పునరుద్ధరణలపై వెనుకడుగు వేసిందని, కానీ హైప్రొఫైల్ ప్రారంభోత్సవాలు, వేగంపై వ్యామోహంపైనే ఫొకస్ పెట్టిందని ఆరోపించింది. ఈ మేరకు ఈ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రధాని మోడీపై మూడు ప్రశ్నలు సంధించింది.

ఒడిశా రైలు ప్రమాదం : 100 మందికి క్రిటికల్ కేర్ అవసరం - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ

ఈ ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తన ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. రైలు భద్రత, ట్రాక్ రెన్యువల్స్ పై ఎలా వెనుకడుగు వేశారని అందులో ఆ పార్టీ పేర్కొంది. హైప్రొఫైల్ ప్రారంభోత్సవాలు, వేగంపై వ్యామోహం వంటి అంశాలను అందులో ప్రస్తావించింది. ఇది 3 ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. కాగా అంతకు ముందు జైరాం రమేష్ మాట్లాడుతూ.. 1956 నవంబర్ లో అరియలూరు రైలు ప్రమాదం నేపథ్యంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, 1999 ఆగస్టు గైసాల్ రైలు దుర్ఘటన తర్వాత నితీష్ కుమార్ కూడా అలాగే తన పదవిని వదులుకున్నారని అన్నారు.

కాగా.. ఈ ఘటనపై కాంగ్రెస్ పవన్ ఖేరా కూడా మీడియా ప్రతినిధులో మాట్లాడారు. గతంలో మాధవరావు సింధియా, నితీష్ కుమార్, లాల్ బహదూర్ శాస్త్రి నైతిక కారణాలతో రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. కాబట్టి ఒడిశా రైలు ప్రమాద ఘటనకు ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘‘మానవ విపత్తు సమయంలో మేం రాజకీయాలు చూడము. మాధవరావు సింధియా, నితీష్ కుమార్, లాల్ బహదూర్ శాస్త్రి నైతిక కారణాలతో రాజీనామాలు చేశారు. రైల్వే మంత్రి బాధ్యత తీసుకోవాలి. కానీ మోడీ, నైతిక విలువలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి’’ అపి అన్నారు.

రామ జన్మభూమి తీర్పును వాయిదా వేయాలని లోపలా, బయట నుంచి ఒత్తిడి వచ్చింది - జస్టిస్ సుధీర్ అగర్వాల్

సుమారు 2,500 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పక్కనే ఉన్న ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది.

నెహ్రూ వద్దంటున్నా శాస్త్రి అప్పుడు రాజీనామా చేశాడు.. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ పదవి వదలాల్సిందే- శరద్ పవార్

ఈ ప్రమాదంలో 21 బోగీలు పట్టాలు తప్పి తీవ్రంగా దెబ్బతినడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రెండు ప్యాసింజర్ రైళ్లు అతివేగంతో ఉండటమే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. శిథిలాలను తరలించేందుకు భారీ క్రేన్లను, కూలిపోయిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు. కాగా.. శనివారం మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios