Asianet News TeluguAsianet News Telugu

మెట్రో పిల్లర్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు అధికారులపై కేసు.. .

బెంగళూరు మెట్రో పిల్లర్ కూలి, తల్లీ కుమారుల మరణానికి కారణమైన కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఏడుగురు అధికారులు, కన్‌స్ట్రక్షన్ కంపెనీపై కేసులు నమోదు చేశారు. 

Case against seven officials in Metro pillar collapse incident.. .
Author
First Published Jan 11, 2023, 2:53 PM IST


బెంగళూరులో మెట్రో పిల్లర్ కుప్పకూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు మరణించాడు. అయితే దీనికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ), దాని ఐదుగురు అధికారులు, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్‌ఆర్‌సీఎల్) ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేశారు. 

నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీని మొదటి ముద్దాయిగా (ఏ1) పోలీసులు చేర్చారు. తరువాత బీఎంఆర్ సీఎల్ ఇద్దరు అధికారులను, అలాగే ఐదుగురు ఇంజనీర్లను వరసుగా ఏ8 వరకు చేర్చారు. ఈ ఘటనపై సీఎం స్పందించారు. మెట్రో పిల్లర్ కూలిపోవడాని కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ముంబ‌యి పర్యటనకు ప్రధాని మోడీ.. బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

బెంగళూరు సిటీలో లోహిత్ కుమార్, తేజస్విని అనే దంపతులు తమ రెండేళ్ల కవల పిల్లలైన విహాన్, విస్మితతో కలిసి జీవిస్తున్నారు. భర్త సివిల్ ఇంజనీర్ గా పని చేస్తుండగా.. భార్య ఓ మొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే పిల్లలను ప్లే స్కూల్ లో, భార్యను తన ఆఫీసులో దిగబెట్టేందుకు విహాన్ బైక్ పై బయలుదేరారు. హెచ్‌బీఆర్‌ లేఅవుట్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే నిర్మాణంలో ఉన్న నమ్మ మెట్రో పిల్లర్‌లోని రీన్‌ఫోర్స్‌మెంట్‌ కేజ్‌ బైక్ పై కూలిపోయింది. దీంతో నలుగురికి గాయాలు అయ్యాయి. 

దీనిని గమనించిన స్థానికులు వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి తేజస్విని, విహాన్ లు మరణించారు. ‘‘ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. మేము వారిని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ అప్పటికే చాలా రక్త నష్టం జరిగింది. బీపీ త్వరగా పడిపోయింది.’’ అని డాక్టర్లు తెలిపారు.  మిగితా ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

జోషిమఠ్ ప‌గుళ్లు: ఇప్పటివరకు దెబ్బతిన్న 800 ఇళ్లు.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్తంభం ఎత్తు 40 అడుగులకు పైగా ఉందని, అనేక టన్నుల బరువు ఉంటుందని స్థానికులు పేర్కొననారు. ఈ ఘటనపై గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బాధ్యులైన బీఎంఆర్ సీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 304a, 427 రీడ్ విత్ 34 కింద కేసు బుక్ చేశారు. ఘటనకు సంబంధించి లోహిత్ కుమార్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించారు.

ఈ ఘటనపై ధార్వాడ్‌లో సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి మృతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ నాకు ఇప్పుడే తెలిసింది. విచారణ చేసి.. పిల్లర్ కూలడానికి గల కారణాలను గుర్తించి పరిహారం అందజేస్తాం’’ అని తెలిపారు.

కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై పులి దాడి.. మెడ, చేతులకు తీవ్ర గాయాలు

మెట్రో పిల్లర్ కూలిపోవడంతో లోహపు కడ్డీలను తొలగించే క్రమంలో కళ్యాణ్ నగర్ నుంచి హెబ్బాల్ వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన దాదాపు నాలుగు గంటల తర్వాత బీఎంఆర్ సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అంజుమ్ పర్వేజ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం కూడా ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios