Asianet News TeluguAsianet News Telugu

కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై పులి దాడి.. మెడ, చేతులకు తీవ్ర గాయాలు

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో పులి దాడిలు పెరుగుతున్నాయి. సోమవారం ముగ్గురిపై పులి దాడి చేసిన ఘటన మరవక ముందే మంగళవారం కూడా ఓ బాలికను కూడా పులి గాయపర్చింది. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోంది. 

A tiger attacked a 12-year-old girl who went to collect firewood. She suffered severe injuries on her neck and hands
Author
First Published Jan 11, 2023, 8:25 AM IST

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఘెరం చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల దివ్య అనే బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది.

‘కోవోవాక్స్‌’పై నిపుణుల కమిటీ సమావేశం నేడే..!

గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఒక్క సారిగా పులి అక్కడికి చేరుకొని వెనకాల నుంచి దాడి చేసింది. దీంతో ఆమె మెడకు, చేతులకు గాయాలు అయ్యాయి. పులి దాడితో ఉలిక్కిపడిన బాధితురాలు కేకలు వేసింది. దీంతో సమీపంలోని పొలంలో పనిచేస్తున్న కొంతమంది రైతులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. అనంతరం బాధితురాలుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బాలికకు తీవ్రగాయాలు అయినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పిందని, ఆమె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని బాధితురాలికి చికిత్స అందిస్తున్న డాక్టర్ శశికుమార్ తెలిపారు.

ఘోరం.. బైక్ పై కూలిన మెట్రో పిల్లర్.. తల్లీ కుమారుడి మృతి.. 

కాగా.. ఇలాంటి ఘటనే పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా సబ్ డివిజన్ పరిధిలో ఒకటి జరిగింది. సిరిసియా గ్రామంలో సోమవారం వ్యవసాయ పొలంలో నిమ్మగ్నమై ఉన్న మైనర్ బాలికతో పాటు ఇద్దరు వ్యక్తులపై పెద్ద పులి దాడి చేసింది. ఈ ఘటనపై నౌరంగియా పోలీస్ స్టేషన్‌ అధికారి మాట్లాడుతూ.. సిరిసియా గ్రామానికి చెందిన సోనమ్, సుబాష్ ముసాహర్ అనే ఇద్దరు వ్యక్తులపై పులి దాడి చేసిందన్న సమాచారం తమకు అందిందని పేర్కొన్నారు. బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చెప్పారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కేసు తెరవడమా?

తాజా పులి దాడితో అందరూ భయాందోళనలకు గురవుతున్నారని పశ్చిమ చంపారన్‌లోని గౌనాహా నివాసి గణేష్ రాయ్ ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తో తెలిపారు. ఇలాంటి దాడులు భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలిపారు. పెద్ద పులి ముప్పు వల్ల చాలా మంది రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లడం లేదని తెలిపారు.

సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం.. రూ. 4,276 కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోలు ఆమోదం

గత ఏడాది నవంబర్‌లో వీటీఆర్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది మంది వ్యక్తులు నరమాంస భక్షక పులి బారిన పడ్డారు. దీంతో అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకొని ఆ నరభక్షక పులిని ప్రొఫెషనల్ షూటర్ కాల్చి చంపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios