Asianet News TeluguAsianet News Telugu

ముంబ‌యి పర్యటనకు ప్రధాని మోడీ.. బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..

Mumbai: జ‌న‌వ‌రి 19న ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ ముంబ‌యి రానున్నారు. బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు అభివృద్ధి పథకాలను ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ప్రధాని మోడీ తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ముంబ‌యి మెట్రో 2ఏ, 7 లైన్ల 35 కిలోమీటర్ల విస్తరణను ప్రారంభిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 

BMC elections: PM Narendra Modi to visit Mumbai on January 19
Author
First Published Jan 11, 2023, 2:21 PM IST

Modi To Visit Mumbai On January 19: ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ జ‌న‌వ‌రి 19న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్క‌డ ప‌లు అభివృద్ది ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌డంతో పాటు మ‌రికొన్నింటికి శంకుస్థాప‌న‌లు చేస్తారు. ప్రధాని మోడీ తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ముంబ‌యి మెట్రో 2ఏ, 7 లైన్ల 35 కిలోమీటర్ల విస్తరణను ప్రారంభిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అయితే, అంత‌కుముందు ఇదే తేదీన హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు మోడీ వ‌స్తార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ  తాజాగా ప్ర‌ధాని షెడ్యూల్ లో మార్పు జ‌రిగింద‌ని తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 19న వాణిజ్య రాజధాని ముంబైలో పర్యటించనున్నారు. నగరంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అందువల్ల మహారాష్ట్రలో శివసేన నుండి పౌర సంస్థ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న షిండే-ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రధానమంత్రి పర్యటన చాలా కీలకమైనదిగా మారింది. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ప్రధాని ముంబ‌యికి వెళ్లడం కూడా ఇదే తొలిసారి. గ‌తంలో రాష్ట్రంలో మ‌హావికాస్ అగాడీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా, శివ‌స‌నే రెబ‌ల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే తిరుగుబావుట‌తో కాంగ్రెస్-శివ‌సేన‌-ఎన్సీపీల సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. శివ‌సేన రెబ‌ల్ నాయ‌కులు బీజేపీతో క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

త్వ‌ర‌లో బీఎంసీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికార-విప‌క్షాలు ఇక్క‌డ ప‌ట్టునిలుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని హైద‌రాబాద్ పర్య‌ట‌నను ర‌ద్దు చేసుకుని ముంబ‌యి ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. ఇది రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌వచ్చు. ప్రధాని మోడీ నగర పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ముంబ‌యిలోని మెట్రో 2A, 7 లైన్‌ల 35 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూడా ఆయ‌న‌ ప్రారంభిస్తారు. పౌర ఎన్నికల కోసం షిండే నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రంగా సిద్ధమవుతోందని, దీనిని ప్రధాని పర్యటన తర్వాత త్వరలో ప్రకటించవచ్చని ఇది సూచిస్తుంది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో 28,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 7 STPల (మురుగునీటి శుద్ధి కర్మాగారం) కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంట్లు రోజుకు 2,464 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయగలవు.  రాష్ట్ర ఖజానాకు రూ.6000 కోట్లు వెచ్చించే నగరంలో 400 కిలోమీటర్ల పొడవైన కాంక్రీట్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రధాని మోడీ భూమిపూజ చేయనున్నారు. గోరేగావ్, ఓషివారా, భాండప్‌లలో మూడు ఆసుపత్రుల నిర్మాణానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

కాగా,  2017లో మొత్తం 227 స్థానాలకు జరిగిన బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 84 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 82 సీట్లు గెలుచుకోగలిగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో గత 25 ఏళ్లుగా శివసేన అధికారంలో ఉంది. అయితే శివసేనలో చారిత్రాత్మక చీలిక తర్వాత, చాలా సంవత్సరాల విరామం తర్వాత BMC ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ బలమైన పోటీదారుగా కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios