Asianet News TeluguAsianet News Telugu

జోషిమఠ్ ప‌గుళ్లు: ఇప్పటివరకు దెబ్బతిన్న 800 ఇళ్లు.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

Joshimath: జోషిమఠ్ ప‌గుళ్ల‌ సంక్షోభం మరింత‌గా ముదురుతోంది. అక్క‌డి భూమి ప‌గుళ్ల కార‌ణంగా ఇప్పటివరకు 800 ఇళ్లు దెబ్బతిన్నాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని 131 కుటుంబాలకు చెందిన 462 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు.
 

Joshimath Crisis: 800 houses damaged so far Ongoing relief measures
Author
First Published Jan 11, 2023, 12:53 PM IST

Joshimath Crisis: ఉత్త‌రాఖండ్ లోని జోషిమ‌ఠ్ ప‌గుళ్లు స్థానికంగా ఆందోళ‌న‌ను పెంచుతున్నాయి. ఇప్ప‌టికే ప‌గుళ్లు ఎందుకువ‌స్తున్నాయ‌నే దానిపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల బృందాలు ప‌రిశోధ‌న‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. జోషిమఠ్ ప‌గుళ్ల‌ సంక్షోభం మరింత‌గా ముదురుతోంది. అక్క‌డి భూమి ప‌గుళ్ల కార‌ణంగా ఇప్పటివరకు 800 ఇళ్లు దెబ్బతిన్నాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని 131 కుటుంబాలకు చెందిన 462 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు. మొత్తంగా జోషిమ‌ఠ్ లో సుమారు 20,000 జనాభా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. 

"దాదాపు 800 భవనాల్లో పగుళ్లు కనిపించాయి. మేము స్థానిక ప్రతినిధులతో టచ్ లో ఉన్నాము. కొత్త పగుళ్లు కనిపిస్తే మా దృష్టికి తీసుకురావాలని వారిని కోరాము. 131 కుటుంబాలను ఇప్ప‌టికే పునరావాస కేంద్రాలకు తరలించాము" అని  ఖురానా తెలిపారు. అయితే, కూలిపోయే ప‌రిస్థితులు రావ‌చ్చు అనే అంచ‌నాల క్ర‌మంలో ప్రభుత్వం నుంచి న్యాయంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హోటళ్ల వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు, వ్యాపారులు నినాదాలు చేయడంతో అధికారులు... అక్క‌డి రెండు ప్రధాన హోటళ్లు - హోటల్ మలారి ఇన్, మౌంట్ వ్యూ కూల్చివేతను నిలిపివేశారు. 

జోషిమ‌ఠ్ తాజా వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • ఉత్తరాఖండ్ ముఖ్య‌మంత్రి కార్యదర్శి ఆర్‌ఎం సుందరం జిల్లా యంత్రాంగంతో కలిసి భూమి కుంగిపోవడంతో ఇళ్లు దెబ్బతిన్న వారితో సమావేశం నిర్వహించారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 
  • మంగ‌ళ‌వారం నాడు చాలా ప్రాంతాల్లో ప‌గుళ్లు రావ‌డంతో కూలిపోయే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని పేర్కొంటూ ప‌లు నిర్మాణాలు స‌హా రెండు హోట‌ళ్లు హోటల్ మలారి ఇన్, మౌంట్ వ్యూ కూల్చివేయ‌డానికి అధికారులు చ‌ర్య‌లు ప్రారంభించ‌గా.. హిల్ టౌన్‌లో నిరసనలు చెలరేగాయి. దీంతో అధికారులు కూల్చివేత‌ల విష‌యంలో వెన‌క్కిత‌గ్గారు. 
  • జోషిమఠ్ తర్వాత క‌ర్ణ‌ప్ర‌యాగ్లోని బహుగుణ నగర్‌లోని కొన్ని ఇళ్లలో తాజాగా పగుళ్లు వచ్చాయి. గత ఏడాది నుంచి పగుళ్లు పెరిగాయని, మరమ్మతులు చేసేందుకు జిల్లా యంత్రాంగం రూ.5,200 ఇచ్చిందని, అయితే అది సరిపోలేదని స్థానికుడు ఒక‌రు తెలిపిన‌ట్టు ఏఎన్‌ఐ నివేదించింది. 
  •  
  • జోషిమఠ్ భూవివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ముఖ్యమైన ప్రతిదీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసు విచారణను జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది.
  • జిల్లా యంత్రాంగానికి వారి సహాయ, పునరావాస ప్రయత్నాలలో సహాయపడటానికి జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు రెండూ మోహరించబడ్డాయి.
  • జోషిమఠ్ లో సూక్ష్మ భూకంప పరిశీలన వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. బుధవారం నాటికి పరిశీలన వ్యవస్థలు అమల్లో ఉంటాయని ఎర్త్ సైన్సెస్ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం జోషిమఠ్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ట్వీట్ చేశారు. జోషిమఠ్ లో పరిస్థితిని, ఈ ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న భద్రతా పనులను ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, జోషిమఠ్ ను రక్షించడానికి సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
  • రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎం సుందరం, జిల్లా యంత్రాంగంతో కలిసి భూమి క్షీణత కారణంగా ఇళ్లు దెబ్బతిన్న ప్రజలతో సమావేశం నిర్వహించారు.
  • జోషిమఠ్ తరువాత క‌ర్ణ‌ప్ర‌యాగ్ లోని బహుగుణ నగర్ లోని కొన్ని ఇళ్లలో తాజా పగుళ్లు కనిపించాయి. "గత సంవత్సరం నుండి పగుళ్లు పెరిగాయి. జిల్లా యంత్రాంగం దానిని మరమ్మతు చేయడానికి రూ .5,200 ఇచ్చింది, కానీ అది సరిపోదు" అని స్థానికుడు ఏఎన్ఐకి తెలిపారు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మరొక స్థానికుడు చెప్పారు.
     
Follow Us:
Download App:
  • android
  • ios