కేరళలో వర్షాల దంచికొడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడని అల్పపీడనంతో తీర జిల్లాలు నీటి మడుగులవుతున్నాయి. రోడ్లపై మోకాలు లోతు వరద నీరు వచ్చి చేరింది. కొట్టాయం జిల్లాలో కార్లు కొట్టుకుపోవడం, ప్రభుత్వ బస్సు దాదాపు నీట మునిగిపోయిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. 

తిరువనంతపురం: Keralaలో కుండపోత వర్షం కురుస్తున్నది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరించిన ఐదు జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రోడ్లు నీట మునిగిపోయాయి. కార్లు, వాహనాలు.. ఏవి అడ్డంగా ఉంటే అవి.. వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఓ బస్సే ఏకంగా నీటిలో మునిగిపోయింది. దాని అద్దాల వరకు వరద నీటిలో మునిగింది. దీంతో బస్సును అక్కడే ఆపేసి ప్రయాణికులను సురక్షితగా బయటకు తీసుకువచ్చారు. వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ floods చిత్రాలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Scroll to load tweet…

Arabia సముద్రంలో అల్ప పీడనం ఏర్పడింది. దీని దాటికి కేరళ తీర ప్రాంతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పథానంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇదుక్కి, త్రిస్సూర్‌ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, మరో ఏడు జిల్లాలు తిరువనంతపురం, కొల్లాం, అలప్పూజా, పాలక్కడ్, మలప్పురం, కోళికోడ్, వయానాడ్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Also Read: వరద నీటిలో మునిగిన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.. ట్రాక్టర్లు ఎక్కిన ప్రయాణికులు

రెడ్ అలర్ట్ జారీ అయిన కొట్టాయం జిల్లాకు చెందిన వీడియో అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నది. ఓ కారు వరదలో కొట్టుకుపోతున్నది. మోకాలు నీటి లోతులో స్థానికులు దాన్ని అడ్డుకుంటూ ఓ చోటకు తోస్తున్నారు. మరో వీడియోలో ఇంకొందరు ఓ కారుకు తాళ్లు కట్టి వరద నీటిలోనే వెనక్కి లాగి కట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Scroll to load tweet…

అదే కొట్టాయం జిల్లాలో పూంజార్‌లో ఓ ప్రభుత్వ బస్సు నీటిలో మునిగిపోతున్న భయానక వీడియో వైరల్ అయింది. బస్సు ముందు అద్దాలు దాదాపు సగం మునిగాయి. ప్యాసింజర్లను అక్కడే ఉన్నవారు జాగ్రత్తగా డ్రైవర్ దగ్గరలోని డోరు నుంచి బయటకు దించుతున్నారు. కొట్టాయం జిల్లా కాంజిరాపల్లిలోని వీధుల్లో నీరు నదిలా ప్రవహిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది.

Also Read: ఒకేసారి రెండు అల్పపీడనాలు... నేడూ, రేపు ఏపీలో భారీ వర్షాలు

ఆదివారం, సోమవారాల్లో ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచాన వేసింది. 19వ తేదీ ఉదయం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు బయట అడుగుపెట్టవద్దని, గుట్టలు, నదుల దగ్గరకు అసలే వెళ్లకూడదని సీఎం పినరయి విజయన్ కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

Scroll to load tweet…

నదీ తీరాల్లో జీవించే వారు.. డ్యామ్‌ల దగ్గర నివసించేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అధికారులు చెబుతున్న సూచనలను తప్పక పాటించాలని సీఎం పినరయి విజయన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఏ కారణంగానైనా నదులు, కుంటలు, సరస్సులు, సముద్రంలోకి అడుగుపెట్టవద్దని స్పష్టం చేశారు. జాలర్లూ రెండు రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.