Asianet News TeluguAsianet News Telugu

వరద నీటిలో మునిగిన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.. ట్రాక్టర్లు ఎక్కిన ప్రయాణికులు

బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం వరదమయమైంది. డిపార్చర్, అరైవల్ గేట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎయిర్‌పోర్టులోపల, బయటా వరద నిలిచింది. నగరం నుంచి విమానాశ్రయానికి చేర్చే రహదారులూ నీటమునిగాయి. దీంతో క్యాబ్‌లు రోడ్డుపై ప్రయాణించలేకపోయాయి. ప్రయాణికులు చివరికి ట్రాక్టర్‌లు ఎక్కి విమానాశ్రయానికి చేరడం గమనార్హం.
 

bengaluru airport flooded with heavy rains
Author
Bengaluru, First Published Oct 12, 2021, 3:11 PM IST

బెంగళూరు: కర్ణాటకలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భీకర వర్షానికి అంతర్జాతీయ విమానాశ్రయం వరద నీటిలో మునిగిపోయింది. నిన్న సాయంత్రం కేవలం అరగంటపాటు వర్షం కుండపోతగా కురిసింది. దీంతో కెంపెగౌడ విమానాశ్రయానికి పట్టణం నుంచి ఉన్న రహదారులు, విమానాశ్రయంలోని దారులూ నీట మునిగిపోయాయి. airportకి వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ హఠాత్పరిణామాలకు ఆందోళన చెందారు. విమానాశ్రయం వెళ్లడానికి క్యాబ్‌ డ్రైవర్లు నిరాకరించారు. రోడ్లపై వరద అధికమొత్తంలో పారుతుండటంతో కార్లు ప్రయాణించడం దుర్లభంగా మారింది. ఈ నేపథ్యంలో క్యాబ్‌లు ఎయిర్‌పోర్టుకు వెళ్లలేవు. దీంతో ప్రయాణికులు అక్కడకే తచ్చాడారు. కొందరు అటుగా వెళ్తున్న tractorను ఎక్కి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ కుండపోత వర్షం కారణంగా కనీసం 11 ఫ్లైట్స్ ప్రయాణాలు వాయిదా పడ్డాయి.

bengaluru అంతర్జాతీయ విమానాశ్రయం, డిపార్చర్, అరైవల్ గేట్ల దగ్గర నిలిచి ఉన్న flood water చూపిస్తున్నవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్‌పోర్టు బయటా, లోపలా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. వెంటనే విమానాశ్రయం పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడమే కాకుండా ట్రాఫిక్‌నూ నియంత్రించారు.

ఈ విమానాశ్రయం 2008 నుంచి సేవలు అందిస్తున్నదని, అప్పటి నుంచి సింగిల్ డేలో ఇంతటి వర్షం కురవడం ఇదే తొలిసారి అని ఎయిర్‌పోర్టు ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టు ఇంతటి వరదలను చూడలేదని వివరించారు. డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గానే ఉన్నప్పటికీ ఒక్క ఉదుటన కురిసిన వర్షంతో విమానాశ్రయం వరదమయమైందని తెలిపారు. 

Also Read: Hyderabad Rains : వరదనీటిలో బతుకమ్మలైన కార్లు, ట్రక్కులు.. వాటర్ రెస్టారెంట్లుగా మారిన ఓల్డ్ సిటీ హోటల్స్..

నిన్న సాయంత్రం 15 నుంచి 30 నిమిషాలపాటు వర్షం భారీగా కురిసిందని బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గర గత 24 గంటల్లో 178.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మెటీయోరలాజికల్ సెంటర్ వెల్లడించింది. అదే బెంగళూరు నగరంలో 32.6 మి.మీలు, బెంగళూరు హెచ్ఏఎల్ 20.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. ఈ వర్షం కారణంగా నిన్న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 20 విమానాలు వాయిదా పడ్డాయని, ఆ తర్వాత విమాన సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయని విమానాశ్రయ ప్రతినిధి వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios