Asianet News TeluguAsianet News Telugu

ఒకేసారి రెండు అల్పపీడనాలు... నేడూ, రేపు ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో శుక్ర, శనివారాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

heavy rains in ap in next two days
Author
Amaravati, First Published Oct 15, 2021, 12:58 PM IST

అమరావతి: ఈ రెండురోజులు ఆంధ్ర ప్రదేశ్ లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కోస్తాంద్రపై ఎక్కువగా వుండనుందని... ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మిగతా రాష్ట్రాలపై కూడా ఈ అల్పపీడన ప్రభావం వుండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

బంగాళాఖాతంతో పాటు అరెబియా సముంద్రంలోనూ మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులూ దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణం చల్లబడటం, వర్షాలు కురవనుండటంతో  దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగం తగ్గి కరెంటు కష్టాలనుంచి తాత్కాలికంగా ఊరట లభించనుంది. 

మరోవంక నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ వేగంగా సాగుతోందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు దేశంనుండి పూర్తిగా వైదొలగనున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వ్యాపించటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.   

read more  బంగాళాఖాతంలో అల్ప పీడనం... ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్యం, దాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉందని... దీని ప్రభావం తూర్పుతీరం మీదే కాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్ మీద కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో heavy rains కురవనున్నాయి. 

ఇక అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని... దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇక అటు యుపి, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లలోనూ వర్ష ఉధృతి పెరగనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇటీవల gulab cyclone తెలుగురాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిషాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రమాదాలు సంబంవించాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా తీవ్ర ఆస్తినష్టం జరిగింది. 

cartoon punch వర్షాలొచ్చినా.. వరదలొచ్చినా, ప్రచారం ఆగదు..!!

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. కోస్తాంద్ర ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని... మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios