బీహార్ కుల గణన డేటాను పబ్లిష్ చేయకుండా ఆపలేం - సుప్రీంకోర్టు
బీహార్ కుల సర్వే డేటాను ప్రచురించకుండా ఆపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఏ ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని తేల్చి చెప్పింది.

కుల గణన వివరాలను ప్రచురించకుండా బీహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని, రాష్ట్ర విధాన నిర్ణయ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. బీహార్ లో కుల సర్వేకు అనుమతిస్తూ పాట్నా హైకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తాజాగా అధికారిక నోటీసు జారీ చేసింది. ఈ కేసును 2024 జనవరికి వాయిదా వేసింది.
సిక్కిం వరదలు.. కొట్టుకుపోయిన చుంగ్తాంగ్ ఆనకట్ట.. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏమన్నారంటే ?
దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని బీహార్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుల గణన డేటాను సేకరించలేదని, సర్వే కోసం వివరాలు సేకరించడానికి చట్టబద్ధమైన లక్ష్యం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అయితే బీహార్ ప్రభుత్వం కొంత డేటాను పబ్లిష్ చేసి స్టే ఉత్తర్వులను ముందుగానే ఉల్లంఘించిందని చేసిన పిటిషనర్ల అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాగే తదుపరి డేటా ప్రచురణను నిలిపివేయలేమని పేర్కొంది.
‘‘ప్రస్తుతానికి మేం ఏదీ ఆపడం లేదు. విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఏ ప్రభుత్వాని కానీ అడ్డుకోలేం. అది తప్పే అవుతుంది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారానికి సంబంధించిన మరో అంశాన్ని పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం తెలిపింది.
స్నేహితుడి సాయంతో భర్తను హతమార్చిన భార్య.. దోషిగా తేల్చిన కోర్టు.. కీలకంగా మారిన కుమారుడి వాంగ్మూలం
కాగా. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అప్రజితా సింగ్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో గోప్యత ఉల్లంఘన జరిగిందని, హైకోర్టు ఉత్తర్వులు తప్పు అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఏ వ్యక్తి పేరు, ఇతర గుర్తింపులను బీహార్ ప్రభుత్వం ప్రచురించలేదని, కాబట్టి గోప్యత ఉల్లంఘన జరిగిందన్న వాదన సరికాదని పేర్కొంది.
7 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు.. ముంబైలో ఘటన
ఇదిలా ఉండగా.. అక్టోబర్ 2వ తేదీన బీహార్ ప్రభుత్వం కుల గణన ఫలితాలను విడుదల చేసింది. 2024 లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిని విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర మొత్తం జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), అత్యంత వెనుకబడిన తరగతులు (ఈబీసీలు) 63 శాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.