ఎస్పీ, ఆర్జేడీల గుర్తింపును రద్దు చేయండి - ఎన్నికల కమిషన్ కు విశ్వహిందూ పరిషత్ లేఖ
సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీలు నిబంధనలను ఉల్లంఘించాయని, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఎన్నికల కమిషన్ ను కోరింది. ఈ విషయంపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసింది.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)ల గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి విశ్వ హిందూ పరిషత్ లేఖ రాసింది. తాము సమావేశం అయ్యేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పెరిగిన గ్యాప్.. అదేం లేదన్న కుమారస్వామి.. !
రాజకీయ పార్టీలుగా నమోదు చేసుకున్న ఈ రెండు సంస్థలు నిబంధనలు పాటించలేదని ఆయన తెలిపారు. ఇటీవల రామచరితమానస్‌పై ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యలు చేశారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
తీవ్రవాది నుంచి పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. అదేంటంటే ?
సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య ‘రామచరితమానస్’ను అపవిత్రం చేశారని, దాని పేజీలను తగులబెట్టేలా ఇటీవల వ్యాఖ్యలు చేశారని, ఉద్దేశపూర్వకంగా, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారని అలోక్ కుమార్ ఆరోపించారు. మౌర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదవికి లభించిందని, దీంతో ఆ పార్టీ ఆయన ప్రకటనను సమర్థించిందని రుజువు అవుతోందని తెలిపారు.
కాకరేపుతున్న అదానీ అంశం.. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. !
అలాగే ఆర్జేడీ నాయకుడు చంద్రశేఖర్ కూడా రామచరితమానస్, పవిత్ర గ్రంథాలపై ఉద్దేశపూర్వక, హానికరమైన విమర్శలు చేశారని, ఇది హిందూ సమాజంలో ఆగ్రహం, అపనమ్మకాన్ని సృష్టించిందని అలోక్ కుమార్ ఆరోపించారు. చంద్రశేఖర్‌పై కూడా ఆర్‌జేడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో ఆయన ప్రకటనకు పార్టీ మద్దతిస్తోందని తెలుస్తోందని తెలిపారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం.. ప్రతీ నమోదిత రాజకీయ పార్టీ లౌకికవాదం, ప్రజాస్వామ్య సూత్రాలపై నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘ఎస్పీ, ఆర్జేడీ రెండు పార్టీలు ప్రాథమిక షరతులను ఉల్లంఘించాయి. దీంతో ఆ పార్టీల రిజిస్ట్రేషన్‌ను ఉపసంహరించుకోవలసి ఉంటుంది’’ అని తెలిపారు.