Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పెరిగిన గ్యాప్.. అదేం లేద‌న్న కుమారస్వామి.. !

Bangalore: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ సీఎంలు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు స‌హా జాతీయ, ప్రాంతీయ పార్టీలు, సంఘాల నేతలు హాజ‌ర‌య్యారు. అయితే, కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండే క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాలేదు. దీంతో క‌ర్నాట‌క‌లోకి బీఆర్ఎస్ ఎంట్రీ నేప‌థ్యంలోనే వారి ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కానీ, ఇది అబద్ధమని కుమారస్వామి తేల్చిప‌డేశారు. తాజాగా ఆయ‌న స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 

Bangalore : HD Kumaraswamy reacts to reports that the gap with BRS chief KCR has widened
Author
First Published Feb 2, 2023, 5:04 PM IST

BRS-KCR-HD Kumaraswamy: తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) త‌న పేరును భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) గా మార్చుకుని దేశ రాజ‌కీయాలపై దృష్టి  సారించింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఇత‌ర రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు సాగుతూ.. పార్టీ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది. అయితే, ఇత‌ర రాష్ట్రాల్లో కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండే వారి మ‌ధ్య దూరం పెరుగుతున్న‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ సీఎంలు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు స‌హా జాతీయ, ప్రాంతీయ పార్టీలు, సంఘాల నేతలు హాజ‌ర‌య్యారు. అయితే, కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండే క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాలేదు. దీంతో క‌ర్నాట‌క‌లోకి బీఆర్ఎస్ ఎంట్రీ నేప‌థ్యంలోనే వారి ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. కానీ, ఇది అబద్ధమని కుమారస్వామి తేల్చిప‌డేశారు. తాజాగా ఆయ‌న స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

కర్ణాటకలోని రాయచూర్‌లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి కుమార స్వామి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ కు త‌న‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌నే వార్త‌ల‌ను ఖండించారు. ఈ చ‌ర్చ అన‌వ‌స‌ర‌మైంద‌నీ, ఇందులో వాస్త‌వం లేద‌నీ పేర్కొంటూ అంతా ఆ ఆరోప‌ణ‌లు అంతా అబ‌ద్దం అని స్పష్టం చేశారు. అలాగే, కేసీఆర్ స‌ర్కారుపై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని కుమార స్వామి అన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కొనియాడారు. రానున్న కర్ణాటక ఎన్నిక‌ల‌ను ప్ర‌స్తావిస్తూ అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని  అడ్డుకున్నాయ‌ని ఆరోపించారు. ఈ రెండు పార్టీల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శించారు. 

ఇదిలావుండ‌గా, త్వ‌ర‌లో  ఎన్నికలు జ‌ర‌గ‌బోయే కర్ణాటకకు.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల సాకుతోనైనా ఏదో ఒకటి దక్కుతుందని భావించారు. అయితే పెదవులపై నెయ్యి రుద్దే బదులు నుదుటిపై నెయ్యి రుద్దే పనిని కేంద్ర బడ్జెట్ లో చేశారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. హరిహర నియోజకవర్గంలో పంచరత్న రథయాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బ‌డ్జెట్ పై స్పందించారు. సహజంగానే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ముక్కున వేలేసే బడ్జెట్ అని, ఇది ఎన్నికలకు ముందు ఇచ్చిన బడ్జెట్ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పథకాలను ప్రకటించింది. కానీ వచ్చే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఈ ప్రాజెక్టుల అమలు జరగదని పేర్కొన్నారు. "ఎగువ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయాలని ఏ సంవత్సరంలో దరఖాస్తు చేశాం. ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ఏ మేరకు అమలవుతుంది. ఇప్పుడు ప్రకటించినది కేవ‌లం నెయ్యి రుద్దే చర్య" అని కుమారస్వామి విమ‌ర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios