Asianet News TeluguAsianet News Telugu

presidential election 2022 : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు - మాయావ‌తి

బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే ముందు తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు. 

BSP chief Mayawati announces support for NDA presidential candidate Draupadi Murmu
Author
Lucknow, First Published Jun 25, 2022, 12:05 PM IST

వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి శనివారం ప్రకటించారు. ‘‘ పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ఒక ముఖ్యమైన భాగమని భావించి రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని BSP నిర్ణయించింది ’’ అని తెలిపారు. 

ప్రధాని మోదీ ఎంత బాధ అనుభవించారో దగ్గరగా చూశాను: గుజరాత్ అల్లర్లపై స్పందించిన అమిత్ షా

బీజేపీని స‌పోర్ట్ చేయ‌డం అలాగే కాంగ్రెస్ ను వ్య‌తిరేకించ‌డ‌మో త‌మ నిర్ణ‌యం ఉద్దేశం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘ ఈ నిర్ణయం బీజేపీకి లేదా ఎన్ డీఏకు మద్దతు ఇవ్వడానికి లేదా ప్రతిపక్ష యూపీఏకు వ్యతిరేకంగా వెళ్ళడానికో కాదు. కానీ సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను దేశానికి రాష్ట్రపతిగా చేయాలనేది మా పార్టీ ఉద్దేశం. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం.’’ అని ఆమె చెప్పారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే ముందు ఒక్క సారి కూడా తన‌ను సంప్ర‌దించ‌లేద‌ని మాయావ‌తి అన్నారు. కాబ‌ట్టి ఎన్నికలపై తమ పార్టీకి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని ఆమె అన్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన బీజేపీ నాయ‌కురాలు ముర్మును రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించారు. జార్ఖండ్ గవర్నర్ గా పూర్తి స్థాయిలో ప‌ని చేసిన 64 ఏళ్లు ముర్ము.. ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఒడిశాకు చెందిన తొలి మ‌హిళ‌గా, అలాగే రాష్ట్రప‌తి ప‌దవిని అధిరోహించిన తొలి గిరిజ‌న మహిళగా రికార్డు సృష్టించనున్నారు.

మా కుటుంబాలకు ఏదైనా జరిగితే మీ అందరిదే బాధ్యత: సీఎం ఉద్దవ్‌కు లేఖ రాసిన ఏక్‌నాథ్ షిండే..

కాగా మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ నేతృత్వంలోని జేఎంఎం, జనతాదళ్ (సెక్యులర్) కూడా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్ర‌తిప‌క్షాలు తమ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మాజీ కేంద్ర మంత్రి ఉపాధ్య‌క్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు ప్రకటించాయి.గ‌తంలో విప‌క్ష అభ్య‌ర్థిగా శ‌రద్ పవార్, గోపాల‌కృష్ణ గాంధీ, ఫ‌రుక్ అబ్దుల్లా పేర్ల‌ను ప్ర‌తిపాదించ‌గా.. వారు సున్నితంగా తిర‌స్క‌రించారు. దీంతో టీఎంసీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న య‌శ్వంత్ సిన్హా పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో ఆయ‌న టీఎంసీకి రాజీనామా చేశారు. అనంత‌రం సిన్హా పేరు అధికారంగా ప్ర‌క‌టించారు. కాగా ప్రస్తుత రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకోవడానికి జూలై 18వ తేదీన ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు జూన్ 29 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూలై 21వ తేదీన వెలువ‌డుతాయి. రామ్ నాధ్ కోవింద్ ప‌ద‌వి కాలం జూలై 24వ తేదీన ముగియ‌నుంది. 

26/11 ముంబై ఉగ్రదాడి ప్ర‌ధాన సూత్ర‌ధారికి పాకిస్థాన్‌లో 15 ఏళ్ల జైలు శిక్ష

అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఎన్డీఏ అభ్య‌ర్థికి క‌ల్పించిన విధంగానే, ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా కు కూడా ‘జ‌డ్’ కేటగిరీ భద్రతను శుక్రవారం కల్పించింది. ఇందులో ఉండే సీఆర్ పీఎఫ్ క‌మాండోలు సిన్హా దేశ వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా సెక్యూరిటీ క‌ల్పిస్తారు. కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా కొందరు కీలక ప్రతిపక్ష నేతలకు ముర్ము శుక్రవారం ఫోన్ చేసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios