Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ ఎంత బాధ అనుభవించారో దగ్గరగా చూశాను: గుజరాత్ అల్లర్లపై స్పందించిన అమిత్ షా

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న అలర్ల దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. ఈ క్రమంలోనే గుజరాత్ అల్లర్లకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా స్పందించారు. 

I Saw PM Modi suffer very closely Amit Shah on Gujarat riots case
Author
First Published Jun 25, 2022, 11:06 AM IST

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న అలర్ల దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. సిట్‌ ఇచ్చిన క్లీన్ చీట్ సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు Ehsan Jafri భార్య జాకియా జాఫ్రీ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. ఆ అభ్యర్ధనకు ఎటువంటి అర్హత లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే గుజరాత్ అల్లర్లకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా స్పందించారు. 

గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఆరోపణల కారణంగా ప్రధాని నరేంద్రమోదీ బాధలో ఉండటం తాను చూశానని చెప్పారు. ప్రధాని మోదీపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని అని అన్నారు.అల్లర్లు ముందస్తు ప్రణాళికతో జరగలేదని కోర్టు తెలిపిందని ప్రస్తావించారు.  ఏఎన్‌ఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు, గుజరాత్ అల్లర్ల కేసుల్లో మీడియా, ఎన్జీవోలు, రాజకీయ పార్టీల పాత్ర, భారత న్యాయవ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న విశ్వాసంపై మాట్లాడారు.

గుజరాత్ అల్లర్ల‌‌పై ఆరోపణలతో ఒక పెద్ద నాయకుడు 20 ఏళ్లుగా బయటకు చెప్పకుండానే చాలా బాధను భరించాడని అమిత్ షా చెప్పారు. లార్డ్ శంకర్ 'బిష్పన్' లాగా ఒక పెద్ద నాయకుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 18-19 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశారని అన్నారు. ఆయన ఈ బాధను భరించడం చాలా దగ్గరగా తాను చూశానని తెలిపారు. ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి మాత్రమే ఏమీ మాట్లాడకుండా నిలబడగలడు.. ఎందుకంటే ఈ విషయం న్యాయస్థానంలో ఉంది’’ అని అమిత్ షా అన్నారు.

అల్లర్ల నియంత్రణలో అధికారులు, పోలీసు యంత్రాంగం చాలా బాగా పనిచేశాయని చెప్పారు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతాయనే దానిపై పోలీసులకు లేదా మరెవరికీ తెలియదని తెలిపారు. . ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి రాలేదని గుర్తుచేశారు. కానీ కొందరు పనిగట్టుకుని మోదీపై అభియోగాలు మోపారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అల్లరు చేయించిందని ఆరోపించారు.  ఇప్పుడు నిజమేంటో తేలిపోయింది. ఈ కేసు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడు అది తొలగించబడింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై కూడా అమిత్ షా స్పందించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “సిట్ ముందు హాజరైనప్పుడు మోదీ డ్రామా చేయలేదు. నాకు మద్దతుగా రండి అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలవలేదు. సిట్‌ ప్రశ్నించాలనుకుంటే అందుకు సహకరించేందుకు సీఎం( అప్పుడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు) సిద్ధంగా ఉన్నారు. విచారణకు సహకరించారు. నిరసన ఎందుకు?’’ అని ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios