Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ నుంచి వ‌స్తున్న డ్రోన్ ను పంజాబ్‌లో కూల్చేసిన బీఎస్ఎఫ్‌

పంజాబ్ లోని ఇంటర్ నేషనల్ బార్డర్ లో పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిని మట్టికరిపించారు. ఈ ఘటన ఫిరోజ్ పూర్‌లో శుక్రవారం జరిగిందని బీఎస్ఎఫ్ ప్రకటించింది. 

 

 

BSF shot down a drone coming from Pakistan in Punjab
Author
Delhi, First Published Dec 18, 2021, 5:32 PM IST

పాకిస్తాన్ కు ఎన్ని సార్లు భార‌త్ హెచ్చ‌రిక‌లు జారీ చేసినా ఆ దేశం ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డం లేదు. త‌రుచూ మ‌న దేశంపై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. అందులో భాగంగానే పాకిస్తాన్ నుంచి ఓ డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చింది. దానిని గుర్తించిన భార‌త బీఎస్ఎఫ్ జ‌వాన్లు దానిని మ‌ట్టిక‌రిపించారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన డ్రోన్ ను నేల‌మట్టం చేశామ‌ని ఈరోజు బీఎస్ఎఫ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

భ‌ద్ర‌తా ద‌ళాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ పరిధిలోని అమర్‌కోట్ వద్ద ఇంట‌ర్నేష‌న‌ల్ బార్డ‌ర్‌కు 300 మీటర్లు, అమ‌ర్‌కోట్‌లో ఉన్న బార్డ‌ర్ ఫెన్సింగ్‌కు 150 మీట‌ర్ల ఎత్తులో ఎగురుతున్న మేడ్-ఇన్-చైనా డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం నేల కూల్చింది. ‘‘సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో రాత్రి 11.10 గంటల సమయంలో కొంతమంది సిబ్బంది ఎగిరే శబ్దం వినిపించారు. సరిహద్దు పోస్ట్, వాన్ గ్రామం మధ్య డ్రోన్ తక్కువ ఎత్తులో ఎగురుతోంది. దీంతో అప్రమత్తమైన ఎక్స్-103 బెటాలియన్ సిబ్బంది వెంటనే అక్క‌డి చేరుకున్నారు.డ్రోన్ ప్రొపెల్లర్‌లను రైఫిల్ బుల్లెట్ల‌తో షూట్ చేసి దానిని ధ్వంసం చేశారు.  అనంత‌రం దానిని  బ్యాటరీని అన్‌ప్లగ్ చేశారు. అందులో నుంచి ఎలాంటి ప‌దార్థాలు ల‌భించలేదు. కూలిపోయిన డ్రోన్ రెక్కీ నిర్వ‌హించే ర‌కానికి చెందిన‌ది. ఇది బ‌హుషా ప్రాంతాన్ని సర్వే చేయడానికి వ‌చ్చి ఉంటుంది.’’ అని బీఎస్ఎఫ్ కు చెందిన హయ్యర్ అఫీషియ‌ల్స్ చెప్పారు. 

రావత్ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై చాలా ఫెయిర్‌గా విచారణ సాగుతుంది.. ఇప్పుడే కామెంట్ చేయలేం: ఎయిర్ చీఫ్ వీఆర్ చౌద‌రీ

డిసెంబ‌ర్ నెల మొద‌టి వారంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒకటి జ‌రిగింది. అమృత్‌సర్ సెక్టార్‌లోని  పాకిస్తాన్ వైపు నుంచి వ‌స్తున్న డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కాల్పులు జ‌రిపింది. దీంతో ఆ డ్రోన్ తిరిగి అటే వెళ్లిపోయింది. ఈ ఏడాది పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ ల చొరబాట్లు గణనీయంగా పెరిగాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ బార్డ‌ర్ వ‌ద్ద బీఎస్ఎఫ్ ద‌ళాలు ఎప్పుడూ గ‌స్తీ నిర్వ‌హిస్తోంది. పాకిస్తాన్ నుంచి వ‌స్తున్న డ్రోన్ ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 20కి పైగా కేసులు నమోదయ్యాయి. గ‌త వారంలో ఇంట‌ర్నేష‌న‌ల్ బార్డ‌ర్ వెంట ఉన్న చద్వాల్ ప్రాంతంలో డ్రోన్ కనిపించడంతో బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వ‌హించాయి. డ్రోన్ ల ద్వారా ఆయుధాలు లేదా డ్ర‌గ్స్ వంటివి స‌ర‌ఫ‌రా అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో దానిని అంచ‌నా వేయ‌డానికి ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios