ఛత్తీస్‌గడ్‌లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు (Encounter in Chhattisgarh) జరిగాయి. దంతెవాడ (Dantewada) జిల్లా గొండెరాస్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్‌గడ్‌లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు (Encounter in Chhattisgarh) జరిగాయి. దంతెవాడ (Dantewada) జిల్లా గొండెరాస్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై మొత్తంగా 6 లక్షల రూపాయిల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు.. అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొండెరాస్ గ్రామ సమీపంలోని అడవిలో ఉదయం 5.30 గంటలకు కాల్పులు జరిగినట్లు దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ (Abhishek Pallava) తెలిపారు.
ఎదురుకాల్పులు ముగినిస తర్వాత ఆ ప్రాంతంలో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టుగా పోలీసులు తెలిపారు. ఒక మహిళా మావోయిస్టును దర్భా డివిజన్‌లోని మల్లంగెర్ ఏరియా కమిటీకి చెందిన హిడ్మే కొహ్రమేగా గుర్తించారు. ఆమెపై గతంలో రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మలంగెర్ ఏరియా కమిటీలో ఏరియా కమిటీలో కొహ్రమే క్రియాశీలకంగా వ్యవహరించేవారని చెప్పారు. రెండో మహిళను అదే స్క్వాడ్‌కు చెందిన పొజ్జెగా గుర్తించారు. ఆమె చేతన నాట్యమండలి (Chetna Natya Mandli)లో క్రియాశీలకంగా వ్యవమరించేవారని పోలీసులు తెలిపారు.
Also read: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
ఘటన స్థలం నుంచి స్థానికంగా తయారు చేసిన మూడు రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ సామగ్రి తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
